29, ఫిబ్రవరి 2012, బుధవారం

సుమదురాల పాడుతా తీయగా....

ఈ మధ్యన పాడుతా తీయగా గురించి రాయలేదు...కాని నిన్నటి ఎపిసోడ్ చూసాక రాయకుండా ఉండలేక పోతున్నాను...
అతిధిగా వచ్చిన శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు ఈ ఎపిసోడ్ కి ఎంతో వన్నె తెచ్చారు. అందరూ చాలా బాగా పాడారు. నాకైతే ఎవరికైనా వంద శాతం ఇస్తారా!! అస్సలు చూస్తానా అనుకున్నాను. నేను పాడుతా తీయగా మొదటి ఎపిసోడ్ నుంచి చూస్తూనే వున్నాను..మధ్యలో ఒక ఏడు సంవత్సరాలు చూడలేదు అమెరికాలో వుండి వీలు కాలేదు. నిన్నటి ఎపిసోడ్ లో పాడటానికి ఎంచుకున్న పాటలు ఆణిముత్యాలని వేరే చెప్పనక్కర లేదు....చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న మొదటి బహుమతి ఇద్దరికి ఇస్తారేమో అనుకున్నాను....చాలా బావుంది నిన్నటి ప్రోగ్రాం ....
ఈ ప్రోగ్రాం కి వచ్చే అతిధులు అందరూ గొప్ప వాళ్ళే....కాని మామూలు శ్రోతలకు కూడా అతిధిగా పాల్గొనే అవకాశం కల్పిస్తే ఇటు మా కోరిక కూడా తీరుతుంది. సంగీతమంటే అభిమానం ఉండబట్టే కదా ఇంత ఇష్టంగా ఈ ప్రోగ్రాం చూస్తున్నాము....మాలాంటి వారికి కూడా ఒక్క అవకాశం ఇస్తే బావుంటుందని మనవి.... నా తీరని కోరిక ఇదేనేమో..!!
ఎందుకంటే పాడటం రాదు, సంగీత జ్ఞానం లేదు... కాని పాటలు వినడమంటే మాత్రం చాలా ఇష్టం....మంచి పాటలను బాగా పాడిన అందరికి అభినందనలు.....

15, ఫిబ్రవరి 2012, బుధవారం

నా..నువ్వని....!!

నేనిష్టపడే నాకన్నా నువ్వంటే ఇష్టమని
నీ ఇష్టమే నా ఇష్టమని
నీకు తెలిసినా తెలియనట్లే....!!
ఎందుకీ....
దొంగాటల దోబూచులాటలు....!!
నడిరేయి జాబిలమ్మతో సయ్యాటలాడినట్లు
మబ్బుల మాటున దాగిన వెన్నెల రాజు
పసిడి కాంతుల పండు వెలుగుల జిలుగులతో
తళుకులీనుతూ..మలయమారుత
మంచుపూల నును స్పర్శ తో
సుతారంగా తాకితే...!!
నువ్వేనేమో అని కనులు తెరిస్తే...!!
అయ్యో..!! కలలో కలవరమే.. అది..!!

11, ఫిబ్రవరి 2012, శనివారం

దైవస్వరుపాలు

అడగకుండా అన్ని చేసేవారిని ఏమంటారు? పొరపాటు పడకండి ఇంట్లో వాళ్లకి కాదు...ఒక్క ఇంట్లో వాళ్లకి తప్ప....మిగిలిన అందరికి అన్ని అవసరాలు తీర్చే దైవస్వరుపాలు ఎంతమంది వున్నారో చేతులెత్తండి.....-:) అడగటమే ఆలస్యం పెళ్ళాం పిల్లలని కూడా ఇచ్చే ఉదారబుద్ది ఈ రోజుల్లో ఎంతమందికి వుంటుంది చెప్పండి.? పరోపకారార్ధం మిదం శరీరం అన్న సూక్తి అక్షరాలా పాటించే ఓ అపర హరిశ్చంద్రుడు ఈ రోజుల్లో ఉన్నాడంటే నమ్ముతారా!!

9, ఫిబ్రవరి 2012, గురువారం

ఎక్కడి నుంచి ఎక్కడికో....

కధలో వ్యధ
వ్యధలో కలత నిదుర
కలత నిదురలో కల
కలలో కలకలం
కలకలం లో కలవరం
కలవరం లో మెలకువ
మెలకువ లో నిజం
నిజం లో అబద్దం
అబద్దం లో జీవితం
జీవితం లో సంతోషం
సంతోషం లో విచారం
విచారం లో విషాదం
విషాదం లో నిషాగీతం
నిషాగీతం లో సాగే నిట్టూర్పు
నిట్టూర్పు లోంచి ఆశ
ఆ ఆశే చిగురించితే
జీవితం నందనవనం

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

అందరూ దీవించండి......


ఎన్నో ఏళ్ల నాటి ప్రపంచకప్ కల నెరవేరడానికి మన యువరాజ్ చేసిన సాహసాలు మర్చిపోలేనివి. మళ్లీ మనకు గత వైభవపు క్రికెట్ సందడి రావాలన్నా మన పరువు నిలవాలన్నా మన అందరి యువరాజ్ తొందరగా కేన్సర్ మహమ్మారి నుంచి బయటపడి జట్టులోకి రావాలని అందరూ కోరుకోండి. ప్రపంచకప్ కల సాకారమైనట్లే కేన్సర్ మహమ్మారిని కూడా జయించి మళ్ళి యువి తొందరగా కోలుకుని జట్టుకి ఎన్నో విజయాల్ని అందించాలని మనసారా దేవుని ప్రార్ధిస్తూ యువి సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు వుండాలని కోరుకుంటూ....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner