
వ్యధలో కలత నిదుర
కలత నిదురలో కల
కలలో కలకలం
కలకలం లో కలవరం
కలవరం లో మెలకువ
మెలకువ లో నిజం
నిజం లో అబద్దం
అబద్దం లో జీవితం
జీవితం లో సంతోషం
సంతోషం లో విచారం
విచారం లో విషాదం
విషాదం లో నిషాగీతం
నిషాగీతం లో సాగే నిట్టూర్పు
నిట్టూర్పు లోంచి ఆశ
ఆ ఆశే చిగురించితే
జీవితం నందనవనం
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చిన్న పదాలలో జీవితాన్ని చక్కగా వివరించారు.
నచ్చినందుకు ధన్యవాదాలు జ్యోతి గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి