2, అక్టోబర్ 2015, శుక్రవారం

మణి మాలికలు...!!

1. మరుపునే మర్చిపోతే సరి
ఎప్పుడు గుర్తుగానే ఉండిపోతుంది
2. ప్రాణమే నీలో కలిసాక
జీవశ్చవాన్ని నేనుంటేనేం లేకుంటేనేం
3. కన్నీళ్ళు నిండిన కళ్ళకు
నీ రూపం కనపడదేమోనని
4. దిగులు దుప్పటి చుట్టేసింది
   నీ వియోగాన్ని పరిచయిస్తూ  
5. దిగులుగా సాగుతోంది కాలం  
నువ్వు దగ్గరగా లేని క్షణాలను భారంగా లెక్కిస్తూ
6. అలిగిన దిగులు తీరాన్ని తాకింది
 నువ్వు నాలో చేరావని తెలిసి  

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

జ్ఞాపకాలనే జ్ఞాపికలుగా అన్నట్ట్లుంది .... మరుపునే మర్చిపోతే సరి ఎప్పుడు గుర్తుగానే ఉండిపోతుంది అనడం
అస్తిత్వాన్ని కోల్పోవదంలోనూ ఆనందముంది .... ప్రాణమే నీలో కలిసాక జీవశ్చవాన్ని నేనుంటేనేం లేకుంటేనేం అనదం లో
హృదయం తో చూస్తున్నా .... కన్నీళ్ళు నిండిన కళ్ళకు నీ రూపం కనపడదేమోనని
దూరమెంత భారమో కద్దా .... దిగులు దుప్పటి చుట్టేసింది .... నీ వియోగాన్ని పరిచయిస్తూ
కాలానికీ అర్ధం అయ్యింది .... దిగులుగా సాగుతున్నానని నువ్వు దగ్గరగా లేని క్షణాలను భారంగా లెక్కిస్తూ
భూమీఅ ఆకాశం కలిసిన చోట .... అలిగిన దిగులు తీరాన్ని తాకింది నువ్వు నాలో చేరావని తెలిసి
చక్కని మణి మాణిక్యాలు భావనలు
అభినందనలు మంజు గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner