27, అక్టోబర్ 2015, మంగళవారం

వెక్కిరిస్తున్న చేవ్రాలు....!!

కోల్పోయిన జీవితపు ఆశలన్నీ
మూకుమ్మడిగా దాడి చేస్తూ
ఊపిరి సలపనివ్వని అయోమయంలో
పడవేసి ప్రశ్నల శరాలు సంధిస్తూ
నన్ను నా ఎదురుగా నిల్చోబెడుతున్నాయి
నాలో నిద్రాణమైన మరో మనిషి సమాధానం కోసం
సశేషాలుగా మిగిలిన అవశేషాల ఆంతర్యాన్ని
వినలేని నిశ్చలత్వాన్ని అంది పుచ్చుకున్న
మూసిన మది తలుపుల ఆవల దాగిన
వసుదైక తత్వాన్ని నిదురలేపే యంత్రాలు ఎక్కడని
వెదికే యత్నంలో కాలిపోయిన కోర్కెల దాహానికి
ఆనవాలుగా నిలచిన మసి బారిన అద్దంలో
వెక్కిరిస్తున్న చేవ్రాలు కనిపించింది నవ్వుతూ...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

చెప్పాలనుకున్న భావాన్ని చక్కగా చాలా స్పష్టంగా చెప్పారు.

నన్ను నా ఎదురుగా నిల్చోబెట్టి ప్రశ్నిస్తూ .... నా ఆశలు ఆశయాల గతం
కాలిన కోరికల దాహానికి ఆనవాలుగా మసి బారిన అద్దంలో
పలుకరిస్తూ
అవి నవ్వుల్లా లేవు
వెక్కిరింతల్లా
అని

అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

dhanyavaadaalu Chandra garu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner