మనసాక్షరాలను వెదుకుతూ
అమ్మదనపు మమకారపు
చెమ్మదనంలో చేరుతున్న
గుండె సడికి గుప్పెడు పదాలతో
నమ్మకాల నజరానాకి పహారా కాస్తూ
అమ్మకాల అనుబంధాలకు స్వస్తి పలుకుతూ
పోతపోసిన అహంకారానికి సమాధి కడుతూ
చరమ గీతాలు పాడాలని అనిపిస్తున్నా
ఎక్కడో ఓ చిన్న మెలిక ఆపుతోంది
మనతో ముడేసుకున్న సాటి బంధాలనేమో...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
బహు చక్కని భావుకత
అస్పృశ్యత ఆపాదించలేని నిలువెత్తు మనసాక్షరాల నీడలో నిలబడున్నాను కాని
అమ్మకాల అనుబంధాలకు స్వస్తి పలికి
పోతపోసిన అహంకారానికి సమాధి కడుతూ చరమ గీతాలు పాడాలని అనిపిస్తున్నా
ఎక్కడో ఓ చిన్న మెలిక
మనఃతో ముడేసుకున్న సాటి బందాలనేనేమో .... ఆపుతోంది అంటూ
అభినందనలు మంజు గారు
dhanyavadalu chandra garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి