
ఏ వెన్నెల విసిరిన వేదనో
ఇలా చేరి గతాన్ని మరచిన జ్ఞాపకమైంది
కాసారం కాని కలగా నిలిచి
సాక్షాత్కారం కాలేని వరమై మిగిలి
నిషిద్దాక్షరమై మది ముంగిట ఉండి పోయింది
మూసిన కనుల ముందర
మురిపించిన మనసు కోరిక తారాడిన తావి
వెదుకలేక వేసారిన ఈ జన్మ అలసింది
రాహుకేతువులు రెప్పపాటున కబళించి
వామపాదంతో కదం తొక్కుతూ
జీవితాన్ని రాబందుల్లా ఏలుతున్నారు
గుండె గురుతులు గుచ్చుతున్నా
ఇంకిన నెత్తుటి రంగులో అగుపగుతూనే
తడి ఆరడం లేదు ఈ ఘనీభవించిన మది చిత్రాలు...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కవిత్వానికి పైత్యానికి ఒకటె మందు అల్లం మురబ్బా. ఐదు రూపాయలు మాత్రమే.
Thank u andi ... Mari ilaa chadive miku edi mando mari :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి