సడి చేయని (అ)ముద్రితాక్షరాలు పుస్తకావిష్కరణ నిన్న అతిరథ మహారథుల సమక్షంలో ఆత్మీయుల ఆనంద
సందడిలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, శ్రీ క్రాంతి శ్రీనివాసరావు గారు, డాక్టర్ పసుపులేటి రమణ గారు, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, సాగర్ శ్రీరామకవచం గారు, ఈమని శివనాగిరెడ్డి గారు, కొంపెల్ల శర్మ గారు కొందరు పెద్దలు భారతదేశం గర్వించదగ్గ గ
ొప్ప నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ యస్.వి.రామారావు గారు, గోళ్ళ నారాయణ రావు గారు, డాక్టర్ త్రిపురనేని రాజగోపాలరావు గారు, డాక్టర్ మల్లిపెద్ది కోటేశ్వరరావు గారు ఇంకా అనేకమంది మహామహులు అనుకోకుండా వచ్చి అందించిన ఆశీస్సుల మధ్యన అత్యద్భుతంగా ఆవిష్కరించబడింది. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా పాదాభివందనాలు.
కోసూరి రవికుమార్ గారు చేసిన పుస్తక సమీక్ష అద్భుతంగా ఉంది. పెద్దలు చెప్పిన సడిచేయని నా అక్షరాలు సమాజాన్ని సరిచేస్తాయో లేదో నాకు తెలియదు కానీ కనీసం ఒక కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వగలిగితే అదే నాకు ఆత్మ తృప్తి. మనసు సవ్వడిని వినగలిగే ప్రతి మనిషికి నా ముచ్చట్లు నచ్చుతాయని అనుకుంటున్నాను.
కార్యక్రమంలో అందరిని అలరించిన సుబ్బారావు గారి హరిశ్చంద్ర పద్యాలు, సభ ఆలశ్యంగా మొదలైనా ఓపికగా వేచి ఉండి ఖాళీ లేకపోయినా చివరి వరకు నిలబడి తమ అభిమానాన్ని అందించిన నా అనుంగు పుత్రులు, సోదరులు, ముఖ పుస్తక మిత్రులు, ఎంతో దూరం నుంచి వచ్చిన నా చిన్ననాటి నేస్తాలు, మిత్రులు, బంధువులు వెరసి నా ఆత్మీయులు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు .
కార్యక్రమాన్ని ఆద్యంతమూ చక్కగా నిర్వహించిన మల్లెతీగ కలిమిశ్రీ గారికి వందనాలు.
ఆర్ధిక, హార్దిక సహాయ సహకారాలను అందించిన శ్రీ రామకృష్ణ వజ్జా గారికి, పద్మజ గుత్తా, సత్య స్వాతి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరికి పేరు పేరునా నా ధన్యవాదాలు.
కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
సడిలేని నా అక్షరాలను సందడి చేయించి సవ్వడిని అందరికి వినిపించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా వందనాలు. తెలియకుండా నావలన ఏమైనా పొరపాట్లు జరిగితే పెద్ద మనసుతో మన్నించండి.