1. చుట్టరికం
అవసరమే
తంత్రం
అనివార్యం
నమ్మకం
బలమైనది..!!
2. ఇల్లెంత
విశాలమో
మనసంత
ఇరుకు
పరాయి సొత్తు
మనదనే బ్రాంతి..!!
3. నటించడం
అలవాటై పోయింది
జీవన నాటకంలో
పాత్రదారులకు
ప్రపంచం
ఓ పెద్ద రంగస్థలం..!!
4. మాటలు
ముత్యాలు
మూటలు
విలువైనవి
మరణం
అనివార్యం..!!
5. అవసరమని
తీసుకోవడం
స్వా’ర్జితమని
స్వాహా చేయడం
మని’షికి
తెలివెక్కువ..!!
6. కథలాంటి
బతుకు
వ్యథలతో
నిత్య సమరం
అక్షరాలకు దక్కిన
అరుదైన చెలిమి..!!
7. సాక్ష్యాలు
మనసుకి
సంతకాలు
మనిషికి
కాలం
నిర్వికారం..!!
8. దూరాభారం
నాలుగడుగులైనా
మనమన్న మాట
మరిచినప్పుడు
రక్త సంబంధాలు
రాతి బంధాలు..!!
9. పాశం
బలమైనదే
మనిషి
అవసరాన్ని బట్టి
కాలానికి
ఆమోదయోగ్యమే..!!
10. అమ్ముకోవడం
అవసరార్ధం
కొనుక్కోవడం
సంతోషకరం
క్రియలు
కాలం చేతిలో..!!
11. మాయ
తెరలు
మనసు
పొరలు
విడివడితే
సత్యమే..!!
12. నిజాయితీకి
నిలువుటద్దం
మోసానికి
మరో రూపం
ఎవరు
చెప్మా..!!
13. ఏమార్చే
మనుష్యులు
ఊసరవెల్లి
వ్యక్తిత్వాలు
జీవితపు
ముఖచిత్రాలు..!!
14. కొందరికి
కొనుక్కోవడమిష్టం
మరికొందరికి
అమ్ముకోవడం అలవాటు
ఏ వ్యవస్థైనా
అతీతం కాదు..!!
15. బాధతో
బంధం విలువ
ధనంతో
కపట ప్రేమలు
ఇజం
తెలుస్తుంది..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి