2, మార్చి 2024, శనివారం

పలకరింపులు - పరిచయాలు..!!

నేస్తం,

        కొన్ని పలకరింపులు ముఖతః కాకపోయినా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తాయి. దాదాపు ముప్పైఐదేళ్ళ క్రిందట ఇంజనీరింగ్ మెుదటి సంవత్సర కాలం పరిచయంలో మా మధ్యన మాటలు చాలా తక్కువే. ప్రతి ప్రాక్టికల్ లో బాచ్ మేట్స్ మి. అయినా మా మధ్యన మాటలు తక్కువే. అయినా మొదట్లోనే నే పెట్టిన నిక్ నేమ్ మాత్రం మా నేస్తాలందరికి తెలుసు. మెుదటి సంవత్సరం తరువాతెప్పుడూమాట్లాడుకొన్నది లేదు. మెున్నటి డిసెంబర్ రీ యూనియన్ లో కూడా కలవలేదు. కాని మా రీయూనియన్ వాట్సప్ గ్రూప్ లో పుట్టినరోజుకి విష్ చేసిన తరువాత క్షేమ సమాచారాల మాటలతో కబుర్లతో నిక్ నేమ్ గుర్తు చేసాను. మా జీనియస్ కి కూడా తన నిక్ నేమ్ తెలుసు. చక్కగా పలకరించిన పలకరింపుకి చాలా సంతోషమనిపించింది. అప్పట్లో తెలుగు రాకపోయినా, ఇప్పుడు నేను రాసినకాలం వెంబడి కలంపుస్తకంలో తన గురించి రాసినది చదవడం భలే అనిపించింది

         పరిచయం ఎంత కాలమని మనం లెక్కలు వేసుకోనక్కర్లేదు. బేషజాలు, హంగులు, ఆర్భాటాలు స్నేహాన్ని ఎక్కువ కాలం నిలపలేవు. జ్ఞాపకానికి కాలంతో పని లేదు. ఎన్ని దశాబ్దాలయినా చెక్కుచెదరకుండానే ఉంటుంది. మనకి ఇప్పుడు డబ్బు, హోదా ఉందని జ్ఞాపకాలను వదిలించుకునే వారికి కొత్తగా చెప్పేదేం లేదు. దూరం బావుందనుకునే కొందరికి దూరమే మంచి నేస్తం. టెక్నాలజీ యుగంలో మనమూ టెక్నికల్ గా కాకుండా కాస్తయినా మనసుద()నముందని నిరూపించుకుందాం..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner