ఓ గంగ కథే ఈ “గంగజాతర”
మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు అక్షర రూపమివ్వడమట, అదీ కుల వృత్తుల గురించి, ఆచార, వ్యవహారాల గురించి రాయడమంటే కాస్త కష్టతరమైన విషయమే. ఎజ్రాశాస్త్రిగారి రచనలు ముఖపుస్తకంలో చూస్తున్నప్పుడు ఈ మాటే అనిపించేది. వ్యవస్థలో దాగిన లోపాలను ఎత్తి చూపడానికి గుండెధైర్యం చాలా ఎక్కువగానే కావాలన, కష్టాన్ని చెప్పడానికి ఆ పలుచని తెరలు తీయడం సుళువు కాదనీ.
ఎజ్రాశాస్త్రిగారు తన “గంగజాతర” నవలలో మన సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలను మన ముందు ప్రత్యక్షంగా చూపారు. కనీస అవసరాలైన తిండి, నీటి కోసం తపన పడే ఓ అణగారిన వర్గాన్ని, నేరం ఒకరు చేస్తే, ఆ నేరాన్ని మరో వర్గానికి ఆపాదించి, వారిని భయబ్రాంతులను చేసి, ఊరు వదిలి పోయేటట్లు చేయడము, ఆ తరువాత వారు పడే ఇబ్బందులు, వీటికి సమాంతరంగా కులంలో జరిగే కులవృత్తులు, కలుపుగోలు తనాలు, మంచి, చెడు వగైరా కార్యక్రమాలు, అనుబంధాలు, ఆప్యాయతలు వంటి అన్నింటిని ఈ “గంగజాతర”లో చూపించారు.
ఆశయ సాధన కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేసారన్న విషయాన్ని, ఫ్లోరైడ్ బారిన పడిన తమ జాతిని ఎలా పరిరక్షించుకున్నారన్న విషయాన్ని సంజీవి, గంగ పాత్రలతో హృద్యంగా చిత్రీకరించి నవలకు చక్కని ముగింపు పలికారు. గొప్పగా రాసిన ఎజ్రాశాస్తిగారికి హృదయపూర్వక అభినందనలు. పుస్తకం కావాల్సినవారు సంప్రదించాల్సిన నెంబరు 7013975274.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి