16, ఏప్రిల్ 2013, మంగళవారం

నీ నవ్వు చెప్పింది నాకు...!!

నీ నవ్వు చెప్పింది నాకు...
నాలో నువ్వేమిటో....!!
నీ మాట చెప్పింది నాకు...
నేనెవ్వరో ఏమిటో....!!

పలికే స్వరం నాదైనా...
ఒలికించిన భావం నీది....!!
పలుకులు నావైనా....
పలికించే లాలిత్యం నీది....!!

జీవితం నాదైనా....
జీవం నువ్వే...!!
ప్రాణం నాదైనా....
ఊపిరి నువ్వే....!!

ఎదురు చూసేది నేనైనా
ఎదుట పడనిది నువ్వే...!!
రెప్ప పాటులో మాయం నువ్వు
అందుకే రెప్ప పడని క్షణం నీ కోసం....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

ఎగిసే అలలు....· చెప్పారు...

చాలా బావుంది ... నాకు
" రెప్ప పాటులో మాయం నువ్వు
అందుకే రెప్ప పడని క్షణం నీ కోసం....!!" ఇది బాగా నచ్చింది..
ఎలాంటి కవిత అయినా.. రాసే కలం మీరు..

చెప్పాలంటే...... చెప్పారు...

-:) నచ్చినందుకు + నాపై మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు ప్రేమ్ గారు

Raahul Reedy చెప్పారు...

chaala bagundhi

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u Raahul garu

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner