15, ఏప్రిల్ 2013, సోమవారం

కలవని తీరాలు....!!

పరధ్యానంలో ఉన్నానా...!!
నీ ధ్యానంలో ఉన్నానా....!!
పరాకులో ఉన్నా చిరాకులో ఉన్నా
నీ తలపుల వాకిట్లోనే ఉన్నా...!!

మూసుకున్న కనురెప్పల చాటుగా
దాచుకున్న అనుభూతుల పొత్తిళ్ళలో
పెనవేసుకున్న అనుబంధం ఆశగా
తొంగి చూస్తోంది నీ కోసమే....!!

రాయలేని కన్నీటి కావ్యాలు
అక్షరాల కోసం ఎదురు చూస్తున్నాయి...!!
చెప్పలేని మనసు స్పందనలు
మూగగా తపిస్తున్నాయి నీకు చెప్పాలని ..!!

మౌనమే సాక్ష్యంగా....మన ఇద్దరి మధ్యన
తల్లడిల్లి పోతోంది ఎటూ చెప్పలేక....!!
దరి చేరని నువ్వు....దూరం కాని నీ ఆలోచనలు
కలవని తీరాల కలయిక ఎప్పుడో....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

బాగుంది . ఓ మారు ఈ లైన్ పరిశీలించుకోండి.
నీ ధ్యానంలో ఉన్నా(నా....)!! అవసరం లేదేమో .

Karthik చెప్పారు...

చాలా బావుంది... నాకు అయితే..
"మూసుకున్న కనురెప్పల చాటుగా
దాచుకున్న అనుభూతుల పొత్తిళ్ళలో
పెనవేసుకున్న అనుబంధం ఆశగా
తొంగి చూస్తోంది నీ కోసమే....!!" ఇది బాగా నచ్చింది..మీకు నా అభినందనలు..

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి శర్మ గారు. ఉన్నా అని ఒప్పుకోకుండా ఉన్నానా.....!! అని అడిగినట్లు...అండి

చెప్పాలంటే...... చెప్పారు...

మీకు నచ్చినందుకు సంతోషం అండి. మీ స్పందనకు ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner