7, ఏప్రిల్ 2013, ఆదివారం

ఆలోచించండి.....!!

ఇల్లంటే....??
కుటుంబం అంటే....??
ఓ బాధ్యత...ఓ హక్కు మాత్రమే కాదు....!!
ప్రేమలు....అభిమానాలు....కోపాలు....తాపాలు....బాధ...సంతోషం....ఇలా అన్ని కలబోసిన మనది మాత్రమే అన్న ప్రపంచం. హక్కులను మాత్రమే గుర్తు ఉంచుకుని బాధ్యతలను మర్చిపోయి....ఎప్పుడో ఒకసారి......అదీ అందరూ నిన్ను కాదన్నప్పుడు  వచ్చినా కూడా సాదరంగా ఆహ్వానం పలికేదే ఇల్లు. ఇంటి విలువ తెలియని వాడికి ఇంటిలోని కుటుంబం విలువ మాత్రం ఎలా తెలుస్తుంది....??
వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అని ఎండమావుల వెంట పడి పోయే వాడికి ఒయాసిస్సు చల్లదనం కాని.....చల్లదనం ఏంటి....అసలు ఒయాసిస్సు అంటేనే తెలియదేమో....!! ఏదో నలుగురు భజనగాళ్ళు తన చుట్టూ చేరి  డప్పు కొడుతుంటే అదే వినసొంపైన వీనుల విందైన సంగీతమని భ్రమలో బతికే వాళ్ళకి అదే స్వర్గం గా కనిపిస్తుంది....అంతే కాని ఈ భజనగాళ్ళు మన దగ్గర సొమ్ములు లేనప్పుడు మనకు అస్సలు మొహమే చూపించలేదని గుర్తుకు రాదు. మనకు తాడు బొంగరం లేనప్పుడు ఆసరా ఇచ్చిన చేయి ఇప్పుడు గుర్తుకు రాదు....ఇది మనిషి సహజ నైజమేమో....!! తిని మర్చిపోతే మామూలే అనుకోవచ్చు కాని తిని...పెట్టిన చేతినే కాటు వేసే గుణాన్ని పాముతో పాటు కొందరు మనుష్య జీవులు కూడా అలవర్చుకున్నాయి. అందుకే ఏదైనా మనకు తోచిన సాయం చేయాలన్నా....ఎవరి మీదైనా జాలి చూపాలన్నా ముందు మన మీద మనం జాలి పడి తరువాత ఎదుటివారి గురించి ఆలోచించాలి. తొందరపడి అపాత్ర దానం చేస్తే తరువాత జీవితాంతం మనమే బాధ పడాల్సి వస్తుంది.

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చెళ్ళున చరచినట్లు చెప్పారుగా .. తలకి ఎక్కుతాయంటారా?
ఇప్పటికే ఇలా చెప్పినందుకు రాక్షసి అయిపోయి ఉంటారు . మీరు ,మీ ఈ పోస్ట్ నాకు నచ్చింది మంజు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

ఇప్పుడేంటండి ఎప్పుడో రాక్షసిని అయిపోయాను :) చాలా సంతోషం వనజ గారు నా టపా మీకు నచ్చినందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner