12, ఏప్రిల్ 2013, శుక్రవారం

చీమలు చెప్పిన సత్యం....!!

నిన్న పొద్దున కాఫీ తాగుతూ బయట కూర్చుంటే పొద్దు పొద్దునే నల్ల గండు చీమలు బారుగా ఒక వరుసలో పోతూ నా కంట బడ్డాయి. చూస్తూ ఉంటే వెనుక చీమల కోసం ఆగుతూ మళ్ళి వాటిని కలుపుకుని పోతూ పక్కలమ్మట రెండు మూడు చీమలు ముందుకు వెనుకకు పోతూ మొత్తం మీద అన్నిటిని కలుపుకుని అన్నీ కలిసి వెళ్ళాయి. నాకు వాటిలో నచ్చిన విష్యం రాలేని వాటి కోసం ఆగడం...చుట్టుపక్కల ఏమైనా జరుగుతుందేమో అని గమనించడం భలే నచ్చింది. మళ్ళి సాయంత్రం చూసినా అదే సీను....మొత్తం మీద చిన్న చీమలైనా మంచి విష్యాన్ని చెప్పాయనిపించింది.
మనలో లేని మంచితనం చిన్న ప్రాణి అయినా వాటిలో ఉంది. కలిసి కట్టుగా ఉండటం అనేది. కాస్త తిండి దొరికినా అన్ని కలిసి పంచుకుంటాయి. మనమేమో మనం తప్ప ఎవరు బావున్నా చూడలేము....
పరాయి వాళ్ళు కానక్కర లేదు ఓ తల్లి కడుపున పుట్టిన వాళ్ళే అయినా తోబుట్టువులు బావుంటే ఓర్వలేరు.
పక్క వాళ్ళు బావుంటే పది రూపాయలు ( ఈ రోజుల్లో పది రూపాయలు కాదు లెండి వెయ్యి రూపాయలు అనాలి కాబోలు) అప్పు అయినా ఇస్తారు అనుకోవాలి కాని మనం పొతే పక్క వాడు కూడా పోవాలి అనుకునే మనస్థత్వం ఎప్పటికి మారుతుందో మరి...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...


మీరు చెప్పినవి నిజాలే . అయితే ఒక చిన్న విషయం మనం గమనించాలి.
వాటి ఆయుః ప్రమాణము బహు స్వల్పం. అందువలననే అవి అంత అన్యోన్యంగా ఉండగలుగుతున్నాయి .
మానవుల ఆయుః ప్రమాణం స్వల్పమైతే వీళ్ళూ అన్యోన్యంగానే ఉంటారేమో !

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో మరి కాకపొతే అన్నోన్యంగా ఉండక పోయినా పర్లేదు కాని అన్నం పెట్టిన వారి నాశనం కోరుకునే బుద్ది మారాలి.. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner