25, మార్చి 2014, మంగళవారం

అమ్మ...!!

దిగంతాల అంచుల నుంచి దైవత్వపు మనసులను
దోచే కమ్మనైన కమనీయ కావ్యం అమ్మ....
భాషల రూపాలు ఎన్నైనా భావాలు
మారని మధుర పలుకులు అమ్మ...
సృష్టికి మూలం ప్రేమకు మార్పులేని
మార్చలేని నిఘంటువు అమ్మ...
జీవాన్ని నవ్వుతూ వదులుతూ
జీవితాన్ని అందించేది అమ్మ...
మోసం ద్వేషం తెలియని మానవత్వపు
మమకారానికి ప్రతిరూపమే అమ్మ...
కన్నీటిలో సంతోషాన్ని చూపించే
ఒకే ఒక్క అమృతమూర్తి అమ్మ...
అమ్మ పిలుపు అమృత భాండాగారాల
వెలకట్టలేని విలువల సంపదే...
అమ్మ అన్న తలపుల ఆనందమే
చెప్పలేని భావాల అక్షర అనుభూతుల
అనురాగ స్రవంతే అమ్మ...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

భావాలు మారని మధుర పలుకులు అమ్మ...సృష్టికి మూలం ప్రేమ నిఘంటువు అమ్మ...జీవాన్ని వదులుతూ జీవితాన్ని అందించేది అమ్మ... మానవత్వం మమకారం ప్రతిరూపం అమ్మ... కన్నీటిలో సంతోషాన్ని చూపించే అమృతమూర్తి అమ్మ...
శుభాభినందనలు అమృతతత్వానికి .... మీలోని అమృతమూర్తి అమ్మకు!

చెప్పాలంటే...... చెప్పారు...

నమస్సులు చంద్ర గారు మీ మంచి మనసుకు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner