3, మార్చి 2014, సోమవారం

మన ప్రజాస్వామ్యం...!!

ప్రజాస్వామ్యమా భరత జన సామ్యవాదమా
నింగినంటిన విజయ జయ కేతనం ఆనాడు
సత్యా హింసల సౌశీల్యాల  పరమత సహనం
శాంతి సౌభాతృత్వాల సహజీవనం సోపానాలుగా
సమతా మమతలతో సాగిన ఆదర్శప్రాయ అనుబంధాలు... 
కలహాల కల్లోలాలు కుటుంబ నియంతల కుతంత్రాలు
కుయుక్తుల కూడికల తీసివేతల హెచ్చవేతలు
నమ్మకంగా ఎన్నుకున్న జనాల నోట్లో మట్టి కొట్టి
పసిడి పునాదుల ప్రాంగణాలు విలాసాల విందులు
ఈ నాటి నవ నాయకుల నిజ రూపాలు
ఇదా మహాత్ములు కలలు గన్న మన ప్రజాస్వామ్యం...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

కలహాల కల్లోలాలు
కుటుంబ నియంతల కుతంత్రాలు
కుయుక్తుల కూడికల తీసివేతల హెచ్చవేతల గణాంకాలు
బాగుంది పొస్టింగ్
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు మీ ఆత్మీయ అభిమానానికి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner