4, మార్చి 2014, మంగళవారం

మరో జన్మగా....!!

మస్థిష్కం నిదురబోయిన క్షణం
మరో లోకం చూడాలన్న ఆత్రుత
పాత బంధాలను వదలలేక
కొత్తదైన మరో ప్రపంచానికి
చేరుకోవాలన్న చిన్న తపన
ఎక్కడో మదిలో దాగున్నట్టుగా
తెలియని నిమిషాల మమతలు
తెలిసిన మనసుల ఆవేదనా
చేరనివ్వని సరి కొత్త ప్రయాణం
అటు ఇటు అన్ని చూసిన
మరో జన్మగా నాకందిన
అద్భుత అలౌకిక దృశ్య కావ్యం
ఈ ముచ్చటైన జీవితం...!!
( నా క్షేమాన్ని కాంక్షించిన ప్రతి ఒక్క ఆత్మీయ బంధానికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు... జీవాన్ని నిలబెట్టిన సన్నిహితులకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను....కృతజ్ఞతా అక్షర కుసుమాలు సమర్పించడం తప్ప...)

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Karthik చెప్పారు...

అద్భుత అలౌకిక దృశ్య కావ్యం
ఈ ముచ్చటైన జీవితం...!!chaalaa baagundi Manju garu:):)

vemulachandra చెప్పారు...

మరో లోకం ఈ జన్మ లోతుల్ని ఆసాంతం చూడాలన్న ఆత్రుత
పాత బంధాలను వదలలేని
కొత్తదైన మరో ప్రపంచానికి చేరుకోవాలన్న చిన్న తపన ఆసరాగా
ప్రతి ప్రాణి తపన ఇది .... బాగుంది పొస్టింగ్
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు కార్తిక్ గారు, చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner