ఒడ్డున ఎగసి పడే అలల వెల్లువకు
తీరాన్ని తాకాలన్న తొందర ఎప్పుడు
పడి లేచే కెరటాలు జీవిత గమనపు
ఆటు పొట్లకు తిరుగులేని ఆదర్శాలు
అందుకోవాలన్న విజయ పధానికి సంకేతాలు
లోపలికి వెళ్ళిన కొద్ది ప్రశాంతంగా అగుపించే
ఈ అంతు తెలియని అద్భుత మహా సాగరం
మనసు సంద్రానికి మౌనగీతం ఈ సాగరం
కల్లోల కడలి ఉప్పొంగే ఉప్పెనల లోగిలి
లోతైన మదికి లోపలి సముద్రమే సాక్ష్యం
మనిషి జీవితానికి అర్ధాన్ని చూపించే
అందమైన సజీవ రూపమే ఈ దృశ్య కావ్యం..!!
నన్ను ఉత్తమ ప్రోత్సాహక విజేతగా నిలిపిన కృష్ణా తరంగాలు సమూహపు బృందానికి నా నమస్సులు... కృతజ్ఞతలు...!!
నాకు సముద్రం అంటే ఏంటో ఎందుకో చెప్పలేనంత ఇష్టం నిన్న కృష్ణా తరంగాలు సమూహంలో చిత్ర కవితకు పోటిగా ఈ చిత్రాన్ని పెట్టారు....పై భావాలు అప్పటికప్పుడు రాసినవి...అవే నన్ను ఉత్తమ ప్రోత్సాహక విజేతగా నిలిపాయి.... బాగా రాయలేక పోయాను అన్ని భావాలు సముద్రంలో ప్రతి ఒక్కటి జీవితానికి చక్కని నిదర్శనం... చూడటానికి అద్భుతంగా ఉంటుంది....అలసి పోకుండా ఎప్పుడు పడి లేచే కెరటాలు మన జీవితపు ఆటు పోట్లకు తట్టుకోవాలని చెప్పే చక్కని సందేశం....ఒద్దు నుంచి కనుచూపు మేరకు కనిపించే సాగరం ఎగసి పడే కెరటాలతో ఎంత అందంగా ఉంటుందో.... లోపలి వెళ్ళిన కొద్ది ప్రశాంతంగా ఉంటుంది మన మనసు భావాలకు ప్రతి రూపం...చుట్టూ సముద్రపు నీరున్నా తాగడానికి పనికి రాక పోవడం అన్నది మన వ్యక్తిత్వానికి నిదర్శనం...( మంచి చెడు )...ఒక్కోసారి వచ్చే ఉప్పెనల హోరు సాగర మధనం తట్టుకోలేని మన ఆవేశాన్ని చూపిస్తుంది...ఆకాశం సంద్రం కలిసినట్లుండే చోటు ఎన్నో కలవని మనసుల మమతలకు సంకేతం...!! ఇలా ఎన్నిటినో తనలో ఇముడ్చుకుని కూడా ఇంత చక్కగా కనిపించే సాగరం కన్నా మన జీవితాన్ని దానికి చక్కని అర్ధాన్ని... ఆదర్శాన్ని మరో ప్రకృతి సిద్ధమైన అందమైన దృశ్యకావ్యం చూపగలదంటారా....అందుకే నాకు ఎనలేని ఇష్టం... ఆదర్శం... ఈ సముద్రమంటే...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి