28, జనవరి 2010, గురువారం

తేనేలూరే తీపి గురుతులు-బాల్యం

నాకు తెలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు అందరికి గుర్తు వుండే ఉంటాయి. మాది వుమ్మడి కుటుంబం అప్పుడు. మా అమ్మ ఒక్కటే అమ్మమ్మ వాళ్ళకు, లేక లేక పుట్టిన సంతానం. మా నాన్న గారు అమ్మ కు మేనమామ. అమ్మ పుట్టిన పదహారు ఏళ్లకు మా మామయ్య పుట్టాడు, తరువాత ఆరు నెలలకు నేను పుట్టాను. చిన్నప్పుడు మేము వేరే ఊరులో ఉండి చదువుకునే వాళ్ళము. మాతో అమ్మమ్మ వుండేది. మా స్కూల్ భలే వుండేది. అప్పుడే కొత్తగా బిల్డింగ్స్ కడుతూ వున్నారు, మాకు చింత చెట్ల క్రింద చదువు చెప్పే వాళ్ళు. మేము సెకండ్ క్లాసు నుంచి ఆ స్కూల్ లో చదివాము. మా స్కూల్ పేరు శిశువిద్యామందిరం. రెండవ తరగతి లో ఆచారి మాస్టరు గారు, పింగళి మాస్టరు గారు క్లాసెస్ చెప్పే వాళ్ళు. పింగళి మాస్టరు గారు పాటలు కుడా చాలా బాగా నేర్పేవారు. ఇక మూడు లో నాగలక్ష్మి టీచర్ గారు వుండే వారు. అప్పుడే నేను నా ఫ్రెండ్ కలిసి వెంకటేశ్వర సుప్రభాతం చెప్పే వాళ్ళము, మా స్కూల్ లో అప్పుడే ఆరువందల మంది పిల్లలు వుండే వాళ్ళు. ప్రేయర్ కుడా అప్పటి నుంచే నేను నా ఫ్రెండ్ చెప్పే వాళ్ళము. ప్రేయర్ తో పాటు ఒక సంసృత శ్లోకం కుడా చెప్పి దాని అర్ధం చెప్పే వాళ్ళము. తరువాత న్యూస్ పేపర్ కుడా చదివే వాళ్ళు. ఇక లేట్ గా వచ్చిన వాళ్ళ కు పనిష్మెంట్ వుండేది. తరువాత క్లాసెస్ స్టార్ట్ .....క్లాసెస్ లో పాఠాలతో పాటు డ్రాయింగ్, డిబేట్స్, ఆటలు ఇలా అన్ని ఉండేవి.సాయంత్రం స్టడీ క్లాసెస్ ఉండేవి, వాటిలో కొద్ది సేపు చదువు, తరువాత భగవద్గీత, హనుమాన్ చాలీసా .....ఇలా ఎదో ఒకటి చదివించే వాళ్ళు. స్కూల్ ఐన తరువాత పక్కనే పార్క్ లో ఆడుకోడం, దగ్గర లోనే లైబ్రరీ కి వెళ్లి పుస్తకాలు చదివి ఇంటికి వెళ్ళడం.... ఇలా ఇంకా చాలా విశేషాలు ఆ స్కూల్ లో వున్నన్ని రోజులు ఇలాగే వుండేది.

శ్రీలత టీచర్ గారు పాటలు బాగా పాడి నేర్పించే వాళ్ళు, సోషల్ చెప్పే వాళ్ళు. రత్నరావు గారు హెడ్ మాస్టర్ గారు ఇంగ్లీష్ చెప్పే వాళ్ళు. ప్రైవేటు క్లాసెస్ పెట్టి కొద్ది గా తప్పు చదివినా బాగా కొట్టే వారు. ఇంకా తెలుగు మాస్టర్ గారు, లెక్కల మాస్టర్ గారు, సైన్సు మాస్టర్ గారు, కమల టీచర్ గారు, హింది టీచర్ ప్రమీల రాణి గారు, మీసాల మాస్టర్ గారు ఇలా ఎందరో మహానుభావుల పుణ్యం ఈ రోజు ఇలా వున్నామంటే......
ఇక సెలవు రోజు ఐతే గాలి గోపురం దగ్గరకు, పక్కనే శివాలయం, కొద్ది దూరం లో లంకమ్మ గుడి మద్య మద్య లో ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళడం,ఆటలు సరిపోయేవి. సిక్స్ క్లాసు వరకు చదువు ఇలా సాగింది. మద్యలో అమ్మకు ఆరోగ్యం బాలేక మా వూరు నుంచి ఆ రోజులలో బస్సు లో వెళ్ళేవాళ్ళము ఆరు మైళ్ళు. తరువాత విజయనగరం వెళ్ళిపోయాము.
ఇంకా వుంది........

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

alochinche చెప్పారు...

aa photo lo vunnadi meerena?

చెప్పాలంటే...... చెప్పారు...

kaadu evaro pettaru

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner