
30, ఏప్రిల్ 2010, శుక్రవారం
మరపురానిమనీషి శ్రీశ్రీ....

వర్గము
కబుర్లు
28, ఏప్రిల్ 2010, బుధవారం
వీడ్కోలు
వీడ్కోలు అంటేనే చాలా బాధ పడే పదం. అది సంతోషమైనది అయినా బాధ కలిగించేది అయినా వీడ్కోలు అంటేనే మనసు బరువెక్కుతుంది. నా చిన్నప్పుడు ఫోర్త్ క్లాసులో నన్ను నా స్నేహితురాలిని వేరు వేరు సెక్షన్లలో వేసారు, అప్పుడు తను బాగా ఏడిచింది. నాకు కొద్ది గా బాధ వేసింది కాని అందరు పాత వాళ్ళే నా సెక్షన్ లో వుండటం తో మామూలు గా ఐపోయాను. నా ఫ్రెండ్ మాత్రం తరువాత వేరే స్కూల్ కి వెళ్ళిపోయింది. మళ్ళి ఈ మద్యనే కలుసుకున్నాము పదిహేను ఏళ్ళ తరువాత పాత రోజులు అప్పటి కబుర్లు చెప్పుకున్నాము. ఆ అనుభూతి చెప్తే సరిపోదు అనుభవిస్తేనే తెలుస్తుంది. హై స్కూల్ లో టెన్త్ ఐపోయినప్పుడు ఆటోగ్రాఫ్ అంటే ఎవరికీ ఇచ్చిన గుర్తు లేదు. కాని ఇంటర్ ఐనప్పుడు మాత్రం ఇష్టమైన లెక్చరర్ ల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను. ఇక ఇంజినిరింగ్లో చాలామందికి ఇవ్వడం తీసుకోడం జరిగింది. అవి ఇప్పుడు చదువుతూ వుంటే ఆ తీయని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మళ్ళి పాత రోజులలోకి అలా వెళ్ళి పొతే.....ఒక్క సారి వెళ్ళి చూడండి మీకు కుడా ఎంత ఆహ్లాదంగా వుంటుందో చూడండి......
వర్గము
కబుర్లు
23, ఏప్రిల్ 2010, శుక్రవారం
స్నేహానికి చిరునామా...!!!
మహాభారతంలో నాకు బాగా నచ్చిన పాత్ర కర్ణుడు. స్నేహబందానికి సరైన నిర్వచనం సహజకవచకున్డలధారుడు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సహజకవచకున్డలాలను తనకొడుకు ప్రాణాన్ని రక్షించుకోడానికి మారువేషంలో వచ్చిన దేవేంద్రునికి ధారపోసిన దానకర్ణుడు. శ్రీకృష్ణుడు ద్రౌపదితో సహా ఎన్ని ఎర చూపినా తను నమ్మిన స్నేహధర్మం కోసం ప్రాణాల్ని పణం గా పెట్టిన
త్యాగశీలి. సూద్రునిగా ముద్ర పడిన తనకు అర్ధరాజ్యాన్నిచ్చిన సుయౌధనునికి కడవరకు తోడునిల్చిన చెలికాడు. కన్నతల్లి కుంతి కోరికను కాదని పాండవులు ఎప్పటికి పంచపాన్డవులే అని మాట ఇచ్చి అర్జునుని తప్ప ఎవరిని చంపను అని చెప్పి అందరిని వదిలివేసిన గొప్ప యోధుడు. స్నేహానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, దాన గుణానికి కర్ణుని మించి మరొకరు వుండరు....
త్యాగశీలి. సూద్రునిగా ముద్ర పడిన తనకు అర్ధరాజ్యాన్నిచ్చిన సుయౌధనునికి కడవరకు తోడునిల్చిన చెలికాడు. కన్నతల్లి కుంతి కోరికను కాదని పాండవులు ఎప్పటికి పంచపాన్డవులే అని మాట ఇచ్చి అర్జునుని తప్ప ఎవరిని చంపను అని చెప్పి అందరిని వదిలివేసిన గొప్ప యోధుడు. స్నేహానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, దాన గుణానికి కర్ణుని మించి మరొకరు వుండరు....
వర్గము
కబుర్లు
21, ఏప్రిల్ 2010, బుధవారం
చిన్ననాటి చెలిమి...
కల్మషమెరుగని పసితనపు..
స్వచ్చమైన మనసులకు సాటిరాదు మరేది ఈ ప్రపంచంలో...
ఆ నాటి అల్లరి ఆటలు, పాటలు, గిల్లికజ్జాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో...
మనసును ఆహ్లాదపరిచే మధురానుభూతులు...
మనలను ఉంచుతాయి నిరంతరం ఉల్లాసంగా... ఉత్సాహంగా...
నూతనోత్సాహంతో మరు రోజు పై ఎన్నో ఆశలతో...ఆశయాలతో..
జీవితాన్ని విజయపథానికి నడిపించడానికి...!!
స్వచ్చమైన మనసులకు సాటిరాదు మరేది ఈ ప్రపంచంలో...
ఆ నాటి అల్లరి ఆటలు, పాటలు, గిల్లికజ్జాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో...
మనసును ఆహ్లాదపరిచే మధురానుభూతులు...
మనలను ఉంచుతాయి నిరంతరం ఉల్లాసంగా... ఉత్సాహంగా...
నూతనోత్సాహంతో మరు రోజు పై ఎన్నో ఆశలతో...ఆశయాలతో..
జీవితాన్ని విజయపథానికి నడిపించడానికి...!!
వర్గము
కవితలు
19, ఏప్రిల్ 2010, సోమవారం
ప్రేమోన్మాదం
ఈ మద్యన నేను రాసిన ఓ టపాలో ఈ ప్రేమోన్మాదం గురించి రాస్తే ప్రత్యుత్తరాలు కొన్ని వచ్చాయి. ప్రేమ త్యాగాన్ని కోరాలి కాని ఉన్మాదులని చేయకూడదు. మనం జనారణ్యం లో వున్నామా లేక జన సంచారం లేని మృగారణ్యం లో బతుకుతున్నామా!! నువ్వు ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు కుడా ప్రేమించాలని ఏమైనా శాసనం ఉందా!! మనకు తెలిసి ఈ ఘటనలు కొన్ని మాత్రమే వెలుగు చూస్తున్నాయి...తెలియనివి ఎన్నో .....దీనికి ఒక ఖటినతరమైన శిక్ష వుంటే తప్ప వీటిని కొద్ది గా నైనా ఆపడం వీలుకాదు. ప్రభుత్వం త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని మనవి.
వర్గము
కబుర్లు
13, ఏప్రిల్ 2010, మంగళవారం
నీ కోసం....!!!

నీ పిలుపు వినిపిస్తుందని చూసాను...
మలయమారుతంస్పృసిస్తే
నీ చేతి చల్లని స్పర్సేమో అని చూసా...
వేకువ పొద్దులో ఆకుల పైనుంచి జారిపడే
హిమబిందువులలో నీ ప్రతిబింబం కోసం వెదికా...
పడిలేచే కడలి కెరటాల హోరులో
నీ అల్లరి హోయల కొరకు చూసా..
ఇలా ప్రకృతిలో ఆణువణువూ నీవేనేమో అని
ఆశగా వెదుకుతూనే ఉంటా నీ జాడ తెలిసే వరకు...!!!
వర్గము
కవితలు
12, ఏప్రిల్ 2010, సోమవారం
ఉద్యోగుల వలసలు అరికట్టడం ఎలా?
ఒక సంస్థ నుంచి ఉద్యోగులు అధిక సంఖ్య లో వలసలు వెళ్లి పోతున్నారు అంటే దానికి కారణం ఎవరు? ఉద్యోగులా? లేక వున్నతాధికారులా? ఒక్క క్షణం ఆలోచించండి!! ఇంతకు ముందు ఎంతో బాగున్న సంబంధాలు ఒక్క సారిగా ఎందుకు పాడయ్యాయి? "ఉద్యోగులకు ఉన్నతాధికారులకు మద్య దూరం పెరగటమే ముఖ్య కారణం. ఉన్నతాధికారులు చాలా పరిమితం గా ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే అందుబాటులో వుండటం కుడా ఒక కారణం కావచ్చు. ఆ ముగ్గురు నలుగురు సంస్థలో జరుగుతున్న విషయాలను పై అధికారులకు ఎలా చెప్తున్నారు అన్న దాని మీద ఆధారపడి వుంటుంది. ఒక సంస్థ అభివృద్ధి చెందాలన్నా అధఃపాతాళానికి పోవాలన్నా సంస్థ ఉద్యోగులకు, పైఅధికారులకు మద్యన వున్న సంబంధ బాంధవ్యాలు చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఇవి బాగున్న ఏ సంస్థ అయినా అభివృద్ధి పధం లో ముందుకు దూసుకు వెళుతుంది. డబ్బుతో పాటుగా, విలువలకు కుడా కొద్దిగా ప్రాధాన్యత ఇస్తే ఒకింత మెరుగ్గా ఉంటుందని అనిపిస్తోంది. .
వర్గము
ఆలోచనలు
9, ఏప్రిల్ 2010, శుక్రవారం
ప్రపంచాన్ని నడిపించే బలమైన ఆయుధం

వర్గము
కబుర్లు
5, ఏప్రిల్ 2010, సోమవారం
ముచ్చటైన పల్లెటూరు మా ఊరు

వర్గము
కబుర్లు
3, ఏప్రిల్ 2010, శనివారం
అర్ధం అయ్యి - అవని విష్యం

పదిమందిలో మనము కాకుండా పదిమందిలో ఒక్కడి గా వుంటే.... ఉండటానికి ప్రయత్నిస్తే ఎలా వుంటుందో...!!!ఆలోచించండి...!!
వర్గము
ఆలోచనలు
1, ఏప్రిల్ 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)