28, ఏప్రిల్ 2010, బుధవారం

వీడ్కోలు

వీడ్కోలు అంటేనే చాలా బాధ పడే పదం. అది సంతోషమైనది అయినా బాధ కలిగించేది అయినా వీడ్కోలు అంటేనే మనసు బరువెక్కుతుంది. నా చిన్నప్పుడు ఫోర్త్ క్లాసులో నన్ను నా స్నేహితురాలిని వేరు వేరు సెక్షన్లలో వేసారు, అప్పుడు తను బాగా ఏడిచింది. నాకు కొద్ది గా బాధ వేసింది కాని అందరు పాత వాళ్ళే నా సెక్షన్ లో వుండటం తో మామూలు గా ఐపోయాను. నా ఫ్రెండ్ మాత్రం తరువాత వేరే స్కూల్ కి వెళ్ళిపోయింది. మళ్ళి ఈ మద్యనే కలుసుకున్నాము పదిహేను ఏళ్ళ తరువాత పాత రోజులు అప్పటి కబుర్లు చెప్పుకున్నాము. ఆ అనుభూతి చెప్తే సరిపోదు అనుభవిస్తేనే తెలుస్తుంది. హై స్కూల్ లో టెన్త్ ఐపోయినప్పుడు ఆటోగ్రాఫ్ అంటే ఎవరికీ ఇచ్చిన గుర్తు లేదు. కాని ఇంటర్ ఐనప్పుడు మాత్రం ఇష్టమైన లెక్చరర్ ల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను. ఇక ఇంజినిరింగ్లో చాలామందికి ఇవ్వడం తీసుకోడం జరిగింది. అవి ఇప్పుడు చదువుతూ వుంటే ఆ తీయని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మళ్ళి పాత రోజులలోకి అలా వెళ్ళి పొతే.....ఒక్క సారి వెళ్ళి చూడండి మీకు కుడా ఎంత ఆహ్లాదంగా వుంటుందో చూడండి......

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

మాలా కుమార్ చెప్పారు...

అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు .

చెప్పాలంటే...... చెప్పారు...

avunandi

payaninche చెప్పారు...

nakkuda ante nandi.chinnappati mates ni kaliste chala baguntundi.ee madyana chala mandine kalisanu.mukyanga vakarni kalavalanukunnanu chala sarlu.last ki 18 ella tarvata kalisanu.aa feeling ni anubhavinchale gani explain cheste ardam kadandi babu...

చెప్పాలంటే...... చెప్పారు...

meelaa andaru kalavalani anukunna kalavaleru kadaa!! aa adhbutamaina feelings ni cheppagaligite enkaa baagundedi. any way thanks for your comments.....

Kalyan Guttikonda చెప్పారు...

good, ala vidipoyana friends kalisthe kalige feelings cheppalenivi, endukante danini recent ga memu anubhavincham, maa school lo 10th friends get together nene arrange chesanu, after 15 years, 60+ old friends kalavatam, rojantha spend cheyatam, appati guruvaryulanu sanmaninchatam, eppatiki marchi poleni roju

చెప్పాలంటే...... చెప్పారు...

తాంక్యు కళ్యాణ్ నా బ్లాగ్ నచ్చినందుకు...పాత స్నేహితులు కలిస్తే అది చెప్పలేని మాటలకందని అనుభూతి...మీరు మంచి పని చేసారు జీవితాంతం ఆ ఫీల్ అలాగే వుండి పోతుంది.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner