పక్కనొడు ఏమి చేస్తున్నాడు అని కాకుండా మనం ఏమిటో చూసుకుంటే మంచిది.ఎంతసేపు ఎదుటి వాళ్ళలో వంకలు ఏమి వెదుకుదామా అని కాకుండా మన పని మనం చూసుకుంటే ఒంటికి, ఇంటికి కుడా మంచిది. ఏదో ఒకటి మాట్లదేస్తే సరి పోదు కొద్ది గా మంచి మర్యాద తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు. మా ఆఫీసులో వున్నారు కొందరు వాళ్లకు ఎంతసేపు పక్కన వాళ్ళని ఏమి అందాము అనే కాని వాళ్ళు ఏంటి అన్నది వాళ్లకు అక్కర లేదు. కనీసం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కుడా తెలియకుండా నోటికి ఏది వస్తే అది వాగుతూ అదో గొప్ప విషయంలా ఫీల్ ఐపోతారు. మాట్లాడటం లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు అని వాళ్లకు వాళ్ళే కితాబులిచ్చుకుంటూ వుంటారు. ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు మాట్లాడే మాటను అర్ధవంతం గా మాట్లాడాలి. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోలేము అది గుర్తు ఉంచుకుని ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు.మన గొప్ప మనం చెప్పుకోడం కాదు పది మంది చెప్పుకోవాలి.
ముందు మనం మారితే వేరే వాళ్లకు చెప్పాలి. మీరు అన్నది నిజం కావచ్చు కాని నా రాతలకు అంత ఉందంటారా!! ఏదో వినయ్ ఒక్కరు నిజం చెప్పారు.....మంచివి రాయడానికి ప్రయత్నిస్తాను...థాంక్ యు
ఎవరి పక్షం ఎవరి పక్షం
న్యాయమెవరి పక్షం
ఎవరి పక్షం ఎవరి పక్షం
ధర్మమెవరి పక్షం
ఎవరి పక్షం ఎవరి పక్షం
ప్రజలెవరి పక్షం
ఎవరి పక్షం ఎవరి పక్షం
ప్రకృతెవరి పక్షం
...
అందలం ఎక్కానని అనుకుంటూ అధఃపాతాళానికి పడిపోతూ
అదే విజయమని వెర్రి సంతోషంలో....బతికేస్తున్నారు చాలా మంది జీవితాన్ని నష్ట
పోతూ... నా అన్న వాళ్ళని కోల్పోతూ....!!
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......
నా పేరు మంజు. సాధారణ మద్య తరగతి కుటుంబం. నాకు చిన్నప్పటి నుంచి ఎవరి మీదైనా కోపం వస్తే పుస్తకం లో రాయడం అలవాటు. అమ్మమ్మ తిట్టినా స్నేహితులు పోట్లాడినా ఆ సంఘటన వెంటనే రాయడం అలవాటు. సెవెంత్ నుంచి ఫ్రెండ్స్ కు లెటర్స్ రాయడం తప్ప ఇంకా ఏమి రాదు. ఏదో చిన్న చిన్న కవితలు ఇంజనీరింగ్ చదివేటప్పుడు రాయడం తప్ప ......
ఇదుగో ఇప్పుడిలా రాస్తున్నాను
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
naaku koncham ilanti alavaatu vundi so i will try to correct myself.
this type of posts will be helpful to correct/check our self.
చాలా సంతోషం....టపా చదివి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు కొద్ది గా వున్న దాన్ని కుడా మార్చు కుంటా అన్నందుకు....
These kind of writings may change
that kind of people..Plz write now
n then..these kind of issues..
(OKA SIRA CHUKKA..LAKSHA MEDALLAKU
KADALIKA..)
ముందు మనం మారితే వేరే వాళ్లకు చెప్పాలి. మీరు అన్నది నిజం కావచ్చు కాని నా రాతలకు అంత ఉందంటారా!! ఏదో వినయ్ ఒక్కరు నిజం చెప్పారు.....మంచివి రాయడానికి ప్రయత్నిస్తాను...థాంక్ యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి