1, జులై 2010, గురువారం
నాకనిపించినది.....
జ్యోతిష్యం గురించి కొన్ని బ్లాగుల్లో చదివాను, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు రాసారు కాని అందరిని నమ్మమని చెప్పలేదు. కాని కొన్ని కామెంట్లు చాలా బాధ కలిగించేవి గా వున్నాయి. బ్లాగుల్లో కామెంట్లు రాసే వారికి ఓ విన్నపం. ఎవరికి అనిపించినది వాళ్ళు రాస్తారు దానికి నచ్చితే నచ్చింది అని లేదా మీకు తోచిన మంచి సలహా కాని ఇవ్వండి. అంతే కాని రాసిన వారిని కిన్చపరిచేటట్లు మాట్లాడకండి. ఇది ఒక కామెంట్లకే కాదు అన్నిటికి వర్తిస్తుంది. ఆఫీస్ లో మనకన్న క్రింది వారిని చిన్నతనం గా చూడటం, చెప్పుడు మాటలు వినడమే కాకుండా చెప్పే వారిని అందలం ఎక్కించడం, లేని వారిని హేళనగా మాట్లాడటం ఇలాంటివి చదువు, సంస్కారం వున్న మనం చేయతగని పనులు.
ఎవరి నమ్మకం వారిది. దానిని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. అలాగే ఎవరి వ్యక్తిత్వం వారికుంటుంది, దానికి హేళన చేసే అధికారం కుడా ఎవరికీ వుండదు. ఇది అందరు గుర్తు చేసుకుంటే కనీసం ఒకరి మనసైనా గాయపడకుండా వుంటుంది.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Well said Manju garu. Even i came across many such people in my office, they underestimante others and throw comments at them as if they are so perfect.
అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారండి.." అన్ని వున్న ఆకు అణిగే వుంటుంది ఏమి లేనిది ఎగిరి పడుతుంది" అని... అన్ని చోట్ల ఉన్నారండి అలాంటి వాళ్ళు...
నచ్చినందుకు థాంక్ యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి