10, ఆగస్టు 2010, మంగళవారం

నాన్నా...నీతో చెప్పాలని...

నీకు గుర్తు ఉందా నాన్నా ....!! నాకు నాభిప్రాయాలకి విలువ ఇచ్చి నీకిష్టం లేని పని చేయలేక, నా నమ్మకానికి విలువ ఇచ్చి నేనడిగినది చేయలేక, ఆ రోజు నన్ను ఇంట్లో నుంచి పంపిన రోజు గుర్తు ఉందా!!! ఆ తరువాత చాలా రోజులు నాకంటూ ఓ ఇల్లు లేకుండా పోయింది. నేనెప్పుడు నిన్ను ఏ విష్యం లోనూ ఇబ్బంది పెట్టాలనుకోలేదు కాని పరిస్థితులలా వచ్చాయి. నా నమ్మకానికి, తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళయినా, బయటి వాళ్ళయినా ఒక్కటే అన్న నా అభిప్రాయానికి, మంచి వాడయినా బాద్యత లేదు అన్న నీ అభిప్రాయానికి మద్యలో జరిగిన ఓ సంవత్సరంనర్ర సంఘర్షణ తరువాత నువ్వు అడిగిన మాట " నా ఆస్థి లేకుండా బతకగలవా" అని. నీ కోసం నాన్నా వున్నాను నీ ఆస్థి కోసం కాదు అని ఆనాడే చెప్పాను...ఎలా వున్నా ఏ పరిస్థితిలో వున్నా బతకగలిగేలా నన్ను పెంచావు. ఆస్తులు వున్నా, లేక పోయిన స్థితిలో కుడా దేనికి ఇబ్బంది పడకుండా కాలు కింద పెట్టకుండా పెంచావు....స్టేడియం లో క్రికెట్ మాచ్ అయినా, ఇసుకలో కుర్చుని నాటకం చూడటమయినా ఒకేలా ఆస్వాదించడం నేర్పావు..... కాని ముళ్ళలో వదిలేసావు ఆ రోజు..... అప్పటికి....నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది. ఆత్మీయులు, ఉత్తరాలు, పుస్తకాలు, సినిమాలు, అందరు మంచి వాళ్ళే అన్న నమ్మకం, ఎవరు బాధ పడినా చూడలేని నైజం.....అంతే కాని మనిషికి రెండు రూపాలని అప్పటికి నాకు తెలియదు. నువ్వు నన్ను అలా బయటికి పంపడం వలనే ఆరు నెలల్లో ఒక్కసారిగా అరవైఏళ్ల జీవితం చూసాను. దేనినైనా తట్టుకోగల మనః స్థైర్యాన్ని పొందగలిగాను. ఇప్పుడిలా ఉండగలిగాను అంటే అది మీ పెంపకం, అమ్మ సహకారం అడుగడుగునా నాకందడమే....... ఇంత బాగా పెంచినందుకు చాలా చాలా......... మళ్ళి జన్మలో కుడా మీ కూతురిగానే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నీకో విష్యం తెలుసా నాన్నా!! నీకెంతో ఇష్టమైన నీ చిన్న మనుమడు పుట్టింది కుడా నువ్వు నన్ను ఇంట్లో నుంచి పంపిన
తా
రికునే !!! అది ఆగష్టు పద్నాలుగు గుర్తు వచ్చిందా!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

, చెప్పారు...

avunu...intakee, mee naannagaarini kalli kalisaara???

చెప్పాలంటే...... చెప్పారు...

కలిసాను ఇప్పుడు అందరూ బావున్నారు...........చాలా ఓపికగా నా టపాలు చదివి మీ అభిప్రాయాల్ని రాసిననుడు ధన్యవాదాలు శ్రీధర్ గారు

buddhamurali చెప్పారు...

మీ కోణంలో మీ నిర్ణయం కరక్టే కావచ్చు కాని మీరే కాదు ఎవరైనా ఇలాంటి సందర్భం లో ఒక సారి తండ్రి కోణం నుంచి కూడా అలోచించి చూడండి

చెప్పాలంటే...... చెప్పారు...

నాన్నది తప్పు అని నేను అనలేదు థాంక్యు అండి మురళి గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner