10, డిసెంబర్ 2010, శుక్రవారం

రాష్ట్ర రాజకీయాలు...నేతల పయనమెటో!!

నిన్న సోనియా గారి గురించి రాసింది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. కొందరికి బాధ కలిగి ఉండొచ్చు, మన్నించండి...
కాని నాకు నిజం అనిపించినదే రాస్తాను ఎవరికోసమో నా అభిప్రాయాల్ని మార్చుకోను. ఈ రోజుకి జనం రాజశేఖర్ రెడ్డి గారిని తలచుకుంటున్నారంటే మంచో, చెడో తనను నమ్మిన వారికి ఏ ఆపదా రానివ్వరని అందరికి ఒక బలమైన నమ్మకం....అది ఆయన నిజం చేసుకున్నారు కుడా!! మరి ఆ రక్తమే పంచుకున్న జగన్ ఏమి చేస్తారో!! నాకు చిన్నప్పటి నుంచి కమ్యూనిష్టు పార్టి అంటే ఇష్టం. తరువాత వచ్చిన తెలుగు దేశం, మొన్ననే వచ్చిన ప్రజారాజ్యం , రేపో మాపో రాబోయే జగన్ పార్టి ఇలా ఏ పార్టి వచ్చినా ప్రజలకు ఎంతో కొంత మంచి చేస్తే దానిని కొన్ని రోజులు గుర్తు ఉంచుకుంటాము. ఇంతకు ముందు కుడా తుఫానులు, భూకంపాలు, ప్రకృతి విలయాలు చాలా వచ్చాయి కాని మాకు ఎప్పుడూ ఒక్క సాయం కుడా అందలేదు. వై.ఎస్.ఆర్ గారు అలాంటివి కొన్ని చేసారు...బాంకు రుణాలు, అందరికి ఆరోగ్య సేవలు...స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారు మొదలు పెట్టిన కిలో బియ్యం, మధ్యాన్న భోజన పధకం మళ్లీ అమలు చేసారు. ఇక రైతులకు ఉచిత కరెంట్, పేదలకు పక్కా ఇళ్ళు...ఇలా కొన్ని మంచి పనులు చేయ బట్టే ఇంకా ప్రజల్లో వీళ్ళు చిరంజీవులుగా మిగిలున్నారు. చూద్దాం జగన్ వస్తాడో లేదా మరొకరెవరైనా వస్తారో, ఏ నేతల పయనం ఎటువైపో... ప్రజలకు ఏమి చేస్తారో కొన్ని రోజులు వేచి చుస్తే చాలా ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయేమో!!
మన ఆకలి తీరితేనే కదా పక్క వాళ్ళ ఆకలి గురించి కొంత మందైనా ఆలోచిస్తారు? రాబోయే ఎన్నికల్లో అయినా కొద్దిగానైనా జనానికి మంచి చేసే నేతలను ఎన్నుకోవాలని, అందరూ ఆలోచించాలని, పసిడి పంటల పచ్చని ఆంధ్ర రాష్ట్రం అన్నింటిలో అగ్రగామిగా విలసిల్లాలని మన అందరి కోరిక...

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

John Vincent Raj చెప్పారు...

సోనియా గాంధీ లాంటి మతి లేని వ్యక్తుల గురించి రాస్తే బాధ కాదండి
సంతోషం కలిగింది .................

కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించినందుకు తెలుగు ప్రజలను ఒక అట ఆడుకుంటుంది
అస్సలు సోనియా గాంధీ కి గాని ఆమె కొడుకు రాహుల్ కి కాని మతి ఉంటె ఇలా ప్రవర్తించారు

మీ అభిప్రాయం తో నేను పూర్తి గా ఏకీభవిస్తున్న....

John Vincent Raj చెప్పారు...

రాజకీయాలు ఎంత నిచమో...
కాదు కాదు
అసలు రాజకియలంటేనే నీచం అనే స్థితి కి మన వ్యవస్థ దిగ జారి పొయింది

చెప్పాలంటే...... చెప్పారు...

పని లేని వాళ్లకు రాజకీయాలు అని అందరూ అనుకునే స్థితికి వెళ్లి పోయాయండి

astrojoyd చెప్పారు...

sonamma etante atu

చెప్పాలంటే...... చెప్పారు...

అవునండి -:)

లత చెప్పారు...

పసిడి పంటల పచ్చని ఆంధ్ర రాష్ట్రం అన్నింటిలో అగ్రగామిగా విలసిల్లాలని మన అందరి కోరిక...


మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను.
నాదీ అదే కోరిక

చెప్పాలంటే...... చెప్పారు...

అందరి మనస్సులో అదే కోరిక వుందండి....థాంక్ యు

thinking brain చెప్పారు...

agragamiga nilavali correcte gani raboye rojulle mukkalava boye rastranni chustunte bhayamga badhaga vundi...

చెప్పాలంటే...... చెప్పారు...

చూద్దాము ఏమి జరుగుతుందో...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner