28, ఫిబ్రవరి 2011, సోమవారం
ఆలంబన!!
అలజడి రేపిన కలవరంలో
అప్పుడప్పుడు పలకరించే నీ పిలుపు
అలసిన మనసుకు ఆలంబన!!
అలల తాకిడికి చెల్లాచెదురైన
ఆలోచనలు మేలి ముత్యాలుగా
తీరాన్ని చేరాలంటే నీ దోసిలే
స్వాతి చినుకుల ఆల్చిప్ప!!
పడిలేచే కడలి కెరటం
గెలుపు ఓటములకు సాక్ష్యమైతే
గెలిచే వరకు ఓటమిని ఆస్వాదిస్తూ
ఓటమి పాఠంతో గెలుపు బావుటా
ఎగరేయమని ధైర్య స్తైర్యాలనిచ్చిన
నీ పలుకుల వాడి,వేడి సెగలు
అనుక్షణం సాధించాల్సిన లక్ష్యాన్ని
గుర్తు చేస్తూనే వుంటాయి......!!
అప్పుడప్పుడు పలకరించే నీ పిలుపు
అలసిన మనసుకు ఆలంబన!!
అలల తాకిడికి చెల్లాచెదురైన
ఆలోచనలు మేలి ముత్యాలుగా
తీరాన్ని చేరాలంటే నీ దోసిలే
స్వాతి చినుకుల ఆల్చిప్ప!!
పడిలేచే కడలి కెరటం
గెలుపు ఓటములకు సాక్ష్యమైతే
గెలిచే వరకు ఓటమిని ఆస్వాదిస్తూ
ఓటమి పాఠంతో గెలుపు బావుటా
ఎగరేయమని ధైర్య స్తైర్యాలనిచ్చిన
నీ పలుకుల వాడి,వేడి సెగలు
అనుక్షణం సాధించాల్సిన లక్ష్యాన్ని
గుర్తు చేస్తూనే వుంటాయి......!!
వర్గము
కవితలు
24, ఫిబ్రవరి 2011, గురువారం
కొన్ని పరిచయాలు.....అలా...
మేము చదువుకునేటప్పుడు ఇప్పటిలా ఈ మెయిల్స్, బ్లాగులు, బజ్జులు,సెల్ పోనులు, ఎస్.ఎం.ఎస్ మెసేజ్ లు లేవు. ఉత్తరాలు మాత్రమే ఉండేవి, అదీ మా ఊరిలో అయితే పోస్టు ఆఫీసు కుడా లేదు. వేరే ఊరు వెళ్లి పోస్టు చేయాలి. ఉత్తరం వస్తే మాత్రం ఇంటికి తెచ్చి ఇచ్చేవారు పోస్టుమాన్. నాకు ముగ్గురు కలం స్నేహితులు అదేనండి పెన్ ప్రెండ్స్ వుండేవారు. నా చిన్నప్పటి నేస్తానికి నేస్తం ఒకరు, ఆ నేస్తం నేస్తం మరొకరు, ఇంకొకరు నా ఇంజనీరింగ్ ప్రెండ్ ఉత్తరం రాస్తే అదీ వేరే ఊరు వెళ్లి, వాళ్ళు అది చూసి పక్కన పడేయకుండా జాగ్రత్తగా మళ్ళి నాకు పంపుతూ మరో ఉత్తరం దానితో పాటు రాసారు. అలా అయిన కలం స్నేహం చాలా రోజుల వరకు నడిచింది. ఇప్పుడు ఎక్కడ వుందో తెలియదు.
ఇక నా చిన్నప్పటి నేస్తం నేస్తం గురించి అయితే ఎనిమిది సంవత్సరాలు చూడకుండా రాసుకున్న ఉత్తరాలు, చెప్పుకున్న కబుర్లు, పోట్లాటలు, కవితలు ఇలా ఎన్నో....!! చిన్ననాటి నేస్తం పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడటం నిజంగా ఆ రోజు ఎంత బాగుందో!! తరువాత నా పెళ్ళికి రావడం, మళ్ళి నా కోసం తన నేస్తం తో కలిసి రావడం....ఒక్కోసారి ఇవన్ని గుర్తువస్తోంటే భలే వుంది. నిజంగానే కొన్ని పరిచయాలు అలా ఓ మంచి జ్ఞాపకంలోని అనుభూతిగా మిగిలిపోతాయి.

జ్ఞాపకాలు
నన్ను నేను వెదుక్కోవడం...!!
నీ జ్ఞాపకాల దొంతరల్లో ఎక్కడైనా ఉన్నానేమో అని....
నన్ను నేను ఆశగా వెతుకుతుంటే ఎక్కడా కనిపించలేదు...
ఇక నిరాశగా వెనుదిరుగుతుంటే....
ఎదురుగా కనిపించిందో సాక్ష్యం...!!
మది తలపుల ఎద అరల్లో
ఎవరు చూడని చోటులో
పదిలంగా నిక్షిప్తమైన నన్ను నేను
చూసుకోవడానికి...నీ మనసునే
ముత్యాల సరాల అక్షరాల పదాల కూర్పుల
మాలిక గా చేసిన నీ భావోద్వేగాల రాగహేల!!

23, ఫిబ్రవరి 2011, బుధవారం
ఆ క్షణం....!!
నిశ్శబ్దం నీకు నాకు మద్యన
నిను తలవని క్షణమే లేదు నా ఊసులలో
మరలి రానంటోంది మనసు నీ నుండి దూరంగా
దూరమైనా దగ్గరైనా నీతోనే నేను..నాతోనే నువ్వు
దిగంతాల దూరమైనా పక్కనున్న క్షణమైనా
నీ సమక్షంలోనే ఎప్పుడూ...
నీ చుట్టూనే నిరంతరం...
నేనెవ్వరో మరచిన ఆ క్షణం నుంచి...ఈ క్షణం వరకు
నన్ను నేను చూసుకుందామంటే
కనిపించని నేను...కనుల ఎదుట నువ్వు
నేనే నువ్వై....నా అస్థిత్వాన్ని కోల్పోయానని
నీకు తెలిసేదెన్నడో!!

22, ఫిబ్రవరి 2011, మంగళవారం
ఈ.టి.వి లో పాడుతా తీయగా గురించి....
నిన్న రాత్రి ఈ.టి.వి లో పాడుతా తీయగా ప్రోగ్రాం చూసిన తరువాత ఇది రాయకుండా ఉండలేక పోతున్నాను. బాలు గారిని విమర్శించే అంత పాండిత్యం నాకు లేదు కాని పిల్లలు పాడిన పాటలను బాలు గారు విమర్శించడం ఎంత మాత్రం సమంజసం కాదు. నచ్చిన పాటలు పాడమని పిల్లలకు చాయిస్ ఇచ్చినప్పుడు పాట మనకు నచ్చిందా లేదా అని చూడకుండా పాటకు...పాడే వారు ఎంత వరకు న్యాయం చేసారో చూస్తే బావుంటుంది లేదా అన్ని బాలు గారికి నచ్చిన పాటలే ఇచ్చి పాడమంటే సరి పోతుంది. దానికి మళ్ళి ఇన్ని తతంగాలు అవసరమా!! అన్ని మనకు నచ్చిన పాటలే వుండవు కదా!! అంత మాత్రాన ఆ పాటలు పాడటం బాలేదు అంటే ఎలా? పాటని ప్రజెంట్ చేయడం లో కాని పాడటం లో కాని లోపాలుంటే చెప్పాలి కాని పాటనే బాలేదు అంటే...అది కరక్ట్ కాదు. మన ఇష్టాలు, అభిరుచులు అందరికి అలానే ఉండాలంటే ఎలా వీలవుతుంది? పాటలను, సాహిత్యాన్ని ఎంచడం మాని పాడే పాటకు ఎంత వరకు న్యాయం చేస్తున్నారు అని బాలు గారు చుస్తే బావుంటుంది.....
వర్గము
కబుర్లు
21, ఫిబ్రవరి 2011, సోమవారం
స్నేహానికన్న మిన్న
స్నేహ సౌరభాన్ని గుభాళింప చేసిన అలనాటి ఆణి ముత్యం...రాజ్ కోటి స్వర పరచిన ఈ పాట ప్రాణ స్నేహితులు చిత్రం లోనిది. గాన గంధర్వుని గళం నుంచి అలా...అలా...జాలువారిన వీనుల విందైన ఈ పాటని ఇష్టపడని వారు ఎవరు వుంటారు చెప్పండి. మీ కోసం ఈ పాట లింక్.....
http://www.chimatamusic.com/playcmdtel.php?plist=4195
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడదాకా నీడ లాగ నిను వీడి పోదురా
ఈ గుండెలో పుచేటిది నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమోకటేనురా ...
తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా...ఓ...
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధి రా
ఆ స్నేహామే నీ ఆస్థి రా నీ గౌరవం నిలిపేను రా
సందేహమే లేదు రా ...
త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం...ఓ...
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహము రా
ద్రువతార లా స్థిరమైనదీ...ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమోకటేనురా ...
వర్గము
పాటలు
అమ్మ పలుకు తేనెలొలుకు....
ఎవరూ నేర్పని భాష అదే అదే అమ్మ మాట
అమ్మ లాలిపాటలో సుమధుర సుస్వర సంగీతం
అమ్మ ఊరడింపులో నులివెచ్చని ఓదార్పు
ఓ నా మా ల తో అక్షరాభ్యాసం గుళ్ళో...
బడిలో అ ఆ లు అమ్మ ఒడిలో దిద్దిన జ్ఞాపకం!!
తప్పటడుగుల్లో ఆసరా అందించిన చేయి
అడుగులు నేర్చుకుని ఉరుకుల పరుగులతో
వేయి వేల మైళ్ళు దూరంగా పోయినా...
కన్నతల్లిని, పుట్టిన గడ్డని, నేర్చిన తొలి పలుకుల తీయదనాన్ని ఎప్పటికీ.....
మర్చి పోలేము అమ్మను, సొంత గడ్డను, మాతృభాష పై మమకారాన్ని...

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
నువ్వే...నువ్వే...!!
పెదవి దాటని పలుకుల్లో నువ్వే...
గొంతు పలకలేని స్వరం లోనూ నువ్వే...
మదిలో చెలరేగే ఉహల్లో నువ్వే...
మనస్సు పుటల్లో తడిమే జ్ఞాపకమూ నువ్వే...
ఆస్వాదించే ప్రతి అనుభూతి లోనూ నువ్వే...
చిరుగాలి చిరు స్పర్శలో నువ్వే...
చిరునవ్వులో విరిసే పువ్వులలో నువ్వే...
తొలి పొద్దులో నువ్వే...మలి సందెలోనూ నువ్వే...
పున్నమి వెన్నెలలో నువ్వే...
నిశి రాతిరి చీకటిలోనూ నువ్వే...
తొలకరి చినుకుల్లో మెరిసే హరివిల్లులో నువ్వే...
వాసంత సమీరం...వణికించే చలీ నువ్వే...
వేసవి తాపం... గ్రీష్మ రోషం... నువ్వే...
అందెల సవ్వడి నువ్వే...ఆనంద రాగం నువ్వే...
విషాద గీతం నువ్వే...విరచిత కవనం నువ్వే...
నా గెలుపు నువ్వే... నా ఓటమీ నువ్వే...
అనురాగం నువ్వే..ఆత్మీయతా నువ్వే...
ప్రేమా...ప్రాణం...రెండు నువ్వే..
నేనే నువ్వు...అయినా నువ్వు నువ్వే...
నాతోనే ఎప్పుడూ వుండే నువ్వు నువ్వే...!!!

15, ఫిబ్రవరి 2011, మంగళవారం
ఓ జాబిలీ....
శ్రీ జే వి రాఘవులు గారు స్వరపరచిన మధుర గీతాలలో ఓ మచ్చుతునక ఈ పాట. సుశీలమ్మ గళ గాన మాధుర్యంలో జాలువారిన అద్భుతం.....
మీరే చూడండి.....
http://www.youtube.com/watch?v=Imb4d0o1LbI&feature=player_embedded
ఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం
ఎదురు చూసింది...నిదుర కాచింది...కలువ నీ కోసమే...
వెలుగువై రావోయీ...వెలుతురే తేవోయీ...
ఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...
కదలిపోయే కాలమంతా నిన్ను నన్నూ నిలిచి చూసే
కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే..
భ్రమర నాదాలు...
భ్రమర నాదాలు ప్రేమ గితాలై పరిమళించేనోయి
పున్నమై రావోయీ...నా పున్నమే నీవోయీ...
ఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...
నవ్వులన్ని పువ్వులైనా నా వసంతం నీకు సొంతం...
పెదవి దాటి ఎదను మితే ప్రేమబంధం నాకు సొంతం..
ఇన్ని రాగాలు...
ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి...
అనురాగమే నీవోయీ... అనురాగమే నీవోయీ...

14, ఫిబ్రవరి 2011, సోమవారం
ఊసులాడే ఓ జాబిలమ్మ...!!
ఊసులాడే ఓ జాబిలమ్మ
మూగబోయావెందుకమ్మా!!
నీ వెండి వెన్నెల జారనీయక
జలతారు పరదాలను మబ్బుల మాటున
అడ్డుగా పరిచావెందుకు?
మసక వెన్నెల మాటున
చిరు దీపపు కాంతిలో
ఆరుబయట చల్లగాలికి పిల్లతెమ్మెరలా
ఒక్క మారు పలకరించి పోరాదా!!
నీ జాడ లేక బోసిబోయిన నింగిని చూసి
పక్కున నవ్వే నిశి రాతిరి...
చిన్నబోయిన కలువల కమలాలు...
ఎదురు చూసి ఎదురు చూసి
అలసి సొలసి విసుగుతో వేసారి
కానరాని నీ జాడకై కొమ్మల రెమ్మల మాటున
మసక మబ్బుల్లో నీ కోసం ఆశగా చూసేను...... !!

ప్రేమకు కానుక
ప్రేమకు కానుక ప్రేమే!!
ప్రేమను మించిన కానుక ఇంకేం వుంటుంది? చెప్పండి. ఆకర్షణకు, ప్రేమకు తేడా తెలియని వాళ్లకు ప్రేమ అంటే చెప్పినా అర్ధం కాదు. నిజమైన ప్రేమలోని స్వచ్చత, అనుభూతి ఆస్వాదించాలే కాని మాటలకందనిది. అమ్మ ప్రేమ లోని కమ్మదనం, నాన్న ప్రేమ లోని నమ్మకం, అన్నదమ్ముల ప్రేమలోని ఆప్యాయత, అక్కచెల్లెల్ల ప్రేమలోని అనుబంధం, స్నేహితుల, సన్నిహితుల ప్రేమలోని సహకారం, ఇలా అందరి అనురాగం, అభిమానం కలగలిసిన స్వచ్చమైన వెలకట్టలేని ప్రేమే ప్రేమకు ఇవ్వదగిన కానుక!!
అందరికి ప్రేమికులరోజు శుభాకాంక్షలు.....
వర్గము
కబుర్లు
11, ఫిబ్రవరి 2011, శుక్రవారం
"పాడుతా తీయగా " గురించి....కొన్ని మాటలు
నాకెంతో ఇష్టమైన "పాడుతా తీయగా " మొన్నటి సోమవారం ఎపిసోడ్ చూసాక ఇది రాయకుండా ఉండలేక పోతున్నాను. ఈ టపా ఎవరినైనా బాధ పెడితే క్షమించండి. నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, వినడం చాలా ఇష్టం. సంగీతం గురించి తెలియదు కాని రేడియోలో వచ్చే లలిత సంగీతం, సాముహిక గేయాలు, బయట ఎవరైనా మంచి పాటలు పాడితే వారి దగ్గర నేర్చుకోవడం, టివిలు వచ్చినంక ఇలా పాటల ప్రోగ్రామ్స్ అన్ని చూడటం అలవాటు.
ఇంతకు ముందు శ్రీ వేటూరి గారు నిర్వహించిన ఈ టివి వారి "పాడుతా తీయగా " లో మొదటి సారి రాఘవేంద్ర పాడటం చూసాను, ఎందుకో తెలియదు పాడే విధానం, విమర్శలను కుడా ఆనందంగా తీసుకోవడం అంత చిన్న వయస్సు లో ఆ పరిణితి నాకు బాగా నచ్చింది. వాడు తనకు నచ్చిన పాటలు పాడతాడు అవి అందరికి నచ్చవు కాని పాటని ఎలా పాడుతున్నాడు, ప్రజెంట్ చేసే విధానం ఎలా వుంది, వాడి వయస్సుకు పాడుతున్న పాటకు ఎంత వరకు న్యాయం చేస్తున్నాడు అని చూడకుండా జడ్జిలకు నచ్చిన పాటలు పాడలేదని మార్కులు తక్కువ వేయడం చూసాను. జి టివి వారు నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో కుడా ఇదే జరిగింది దానిలో అతి వినయానికి కుడా ఎక్కువ మార్కులు వేసారు లెండి.
ఇక మొన్న సోమవారం జరిగిన "పాడుతా తీయగా " చుస్తే అంతకు ముందు రెండు మూడు ఎపిసోడ్లలో ప్రధమంగా నిలిచిన రాఘవేంద్ర మొన్న అంతకు ముందు ఎపిసోడ్లకు కలిపి అందరి కన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్నాడంటే నమ్మశక్యంగా లేదు. మరీ మొన్నటి ఎపిసోడ్లో అందరి కన్నా తక్కువ వచ్చాయి.ఎపిసోడు మొత్తం చూసాను కాని మార్కులు మాత్రం న్యాయంగా వేయలేదు. రాఘవేంద్ర వి మూడు షోస్ చూసాను కాని మొన్న తన మార్కులు విని మొఖంలో ఆ అపనమ్మకాన్ని, ఆశ్చర్యాన్ని చూసి నాకే ఎంతో బాధ వేసింది. బాలు గారిని, ఉష గారిని విమర్శించే అంత సంగీత పరిజ్ఞానం లేక పోవచ్చు కాని పాట వింటుంటే బాగా పాడారో లేదో మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. బాలు గారు కుడా ఇలా పక్షపాతం చుపిస్తున్నారంటే నమ్మలేక పోతున్నాను. దయచేసి మేము ఎంతో అభిమానించే "పాడుతా తీయగా " ని కుడా అన్ని టివి షోల్లా చెయ్య వద్దు. ప్రతిభకు పట్టం కట్టండి కాని పలుకుబడికి, అతివినయానికి మార్కులు వేయవద్దు.
రాఘవేంద్రా!!! నీకు నచ్చే పాటలు కాకుండా జడ్జిలకు నచ్చే పాటలు పాడి వారిని మెప్పించి ప్రధముడిగా రావాలి. ఇంతకు ముందు రెండు సార్లు నీకు రాలేదని నువ్వు, మీ ఇంట్లో వాళ్ళు బాధ పడ్డారో లేదో కుడా నాకు తెలియదు కాని నేను చాలా భాద పడ్డాను...షో మొదలవగానే నీ పాట కోసం ఎదురు చూసే వాళ్ళలో మొదటి దాన్ని, నిన్ను మెచ్చుకుంటుంటే మా పిల్లల్ని మెచ్చుకున్నట్లు గా అనుకుంటాను. కౌసల్య గారు నీతో పాడాలని వుంది ఛాన్స్ వస్తే అంటే ఎంత సంతోషం తో పొంగి పోయానో. కనీసం పోన్లో అయినా అభినందిద్దామంటే నీ నెంబరు తెలియదు. బాగా పాడు గుడ్ లక్....
(ఆదివారం పొద్దుట మళ్ళి వస్తుంది ఈ టివిలో వీలైతే చూడండి)

10, ఫిబ్రవరి 2011, గురువారం
ఏమైంది నీకు?
ఏమైంది నీకు? ఎందుకీ దూరం మన మద్య?
తరాల అంతరాలను దాటి ఒకటిగా కలిసి
గమ్యాన్ని చేరే గమనంలో ఎందుకీ మార్పు?
నన్ను నన్నుగా ఇష్టపడిన నువ్వు ఒకప్పుడు...
కాల గమనంలో ఎన్నో మార్పులు, కూర్పులు,
ఓర్పుల నిటూర్పులు.......
నీ ఇష్టంలో మార్పుల చేర్పులు ఇప్పుడు
మారని అప్పటి నేను ఈనాడు నీకు నచ్చలేదేమో!!
ఆనాడు ఈనాడు ఏనాడు నీ ఇష్టాన్ని కాదన్నాను కనుక!!
అందుకే నీకు దూరంగా దూరదూరంగా......!!

8, ఫిబ్రవరి 2011, మంగళవారం
ఆక్రోశం....!!!
చిటపట చినుకుల సవ్వడి
తడిపొడిగా తడిసిన పుడమి
తొలకరి జల్లుతో పులకరించిన ప్రకృతి
పరవశించి పసిడి పంటలు పండిస్తుందనుకుంటే....
కన్నెర్ర చేసిన వరుణుడు కష్టాల కడలికి పంపి
అప్పుల ఊబి లోనికి తోసాడు...కాయకష్టంతో
బతుకు బండిని లాగే రైతన్నను....
ఆపన్న హస్తం అందించి సాయం చేస్తారని
నాయకుని ఎన్నుకుంటే అధికార పీఠం అధిష్టించడానికి
మొదటి మెట్టుగా సామాన్యుని చేసుకుని
ఓట్ల కోసం వాగ్దానాలు గుప్పించి గెలుపు కుర్చీని చేరుకొని
పట్టుపరుపుల నోట్ల కట్టలపై చల్లగా సేద తీరుతూ...
సామాన్యుని ఆకలి కేకలను, చావులను పట్టించుకోని
పదవి కోసం పాకులాడే....ఈ బడాకోరు అవినీతి నాయకులకు
కనువిప్పు కలిగించే రోజు రానుందో!! లేదో!!
పనికి రాడని పక్కన పెట్టిన సామాన్యుడే
పెను ఆయుధమై సంచలనాలు సృష్టించే రోజు
ఈ కుహనా రాజకీయ నాయకుల మనుగడ
ఏ తీరం చేరనుందో!!

7, ఫిబ్రవరి 2011, సోమవారం
ఈజిగా డబ్బులు సంపాయించడం ఎలా..??
ఈజిగా డబ్బులు సంపాయించడం ఎలా అంటే ఈపాటికి మీకందరికీ అర్ధం అయివుండాలి!! కాలేదంటే....ఏమి లేదండి మీకు కొద్ది గా పలుకుబడి, పేరు గొప్ప వుంటే చాలు ఓ రాజకీయపార్టి పెట్టి పార్టినిధి బోల్డు నొక్కొచ్చు. ఇంకా చాలక పొతే అధికార పార్టిలో విలీనం చేస్తే పదవికి పదవి, డబ్బులకు డబ్బులు వస్తాయి. దీనికి మనకి మనస్సాక్షి లేకపోతె సరి పోతుంది. ఏపనైనా చెయ్యవచ్చు డబ్బు, అధికారం కోసం. అర్ధం అయ్యింది కదా ఇప్పుడు డబ్బులు సంపాదించడం ఎంత ఈజినొ!!
వర్గము
కబుర్లు
1, ఫిబ్రవరి 2011, మంగళవారం
నాలో నేను
అమ్మో అప్పుడే మద్య వయసు వచ్చేసిందా!! ఈ నాలుగు పదుల జీవితంలోకి ఓసారి తొంగి చూసుకుంటే...!!
తప్పొప్పులు, తీపి చేదు అనుభవాలు, నిజాలు అబద్దాలు, కొన్ని చేదు నిజాలు, మనకిష్టం లేక పోయినా ఎదుటి వారి ఆనందం కోసం చేసిన పనులు, మనకోసం మాత్రమే...మనకి మాత్రమే సొంతమైన కొన్ని అనుభూతుల పరిమళాలు.....ఇలా ఎన్నో రకాల అనుభూతుల మాలికే దేవుడిచ్చిన ఈ జీవితం. మనకి మాత్రమే సొంతమైన, మనది మాత్రమే అయిన మన జీవితం.
జీవితాన్ని అందరూ అందంగానే మలచుకోవాలని, సంతోషంగానే వుండాలని మొదలు పెడతారు కాని అందరికి అన్ని దొరకవు కదా!! మన గతజన్మ ఖర్మ ఫలితాన్ని బట్టి మన నుదుటి రాతని మనం పుట్టే కొన్ని క్షణాల ముందే రాసేస్తాడు. ఈ లోకం లోకి రావడం మొదలు బతకడానికి పోరాటం మొదలు పెడతాము. అదృష్టవంతులు బంగారు స్పూను నోటిలో పెట్టుకు పుడితే, కొంత మంది వెండి, రాగి ఇలా జీవితాలు మొదలవుతాయి.
నేను బంగారు స్పూనుతో పుట్టక పోయినా అదృష్టవంతురాలినే చిన్నప్పుడు. అందరి ప్రేమ, ఆప్యాయతలు పుష్కలంగా దొరికేవి. మాది పల్లెటూరు అయినా మేము పెరిగిన వాతావరణం చాలా చాలా బాగుండేది. చదువు, పుస్తకాలు,ఆటలు, స్నేహితులు, బంధువులు, సినిమాలు, షికార్లు ఇలా అన్ని ఆనందాలు దొరికేవి. మరి మనకు నచ్చినట్లు వుండే అలాంటి జీవితం దొరకడం దేవుడిచ్చిన వరమే నాకు. చిన్నప్పుడు డాక్టరు అంటే చాలా ఇష్టం పెద్ద అయినంక అదే చదవాలని అనుకునేదాన్ని. సైన్సు బొమ్మలు కూడా బాగా వేసేదాన్ని, కొద్దిగా బాగానే చదివేదాన్ని. పిన్ని వాళ్ళు రికార్డులు రాసుకొంటుంటే నేను రాస్తాను ఇంతకన్నా బాగా అని అనుకునేదాన్ని. నాన్న ఇంటరులో సైన్సు వద్దు లెక్కలు తీసుకో అంటే సరే అని లెక్కలు తీసుకున్నాను. బొమ్మల మీద అభిమానంతో స్నేహితులకు వేసిపెట్టేదాన్ని. తెలుగు అంటే బోల్డు అబిమానం కాని స్పెషల్ తెలుగు తీసుకుంటానంటే ఒప్పుకోలేదు. సరే ఇక ఇంజనీరింగ్ మొదలు.....వెళ్తే క్లాసులకు వెళ్ళడం, లేదా క్లాసులు ఎగొట్టి సినిమాలకు వెళ్ళడం....ఇది అందరూ చేసే పనేలెండి నేనేం కొత్తగా చేయలేదు. కాకపొతే ఇంట్లో వాళ్ళని చూడకుండా ఎక్కువ రోజులు వుండటం అలవాటు లేదు అందుకే పది, పదిహేను రోజులకి ఇంటికి వెళ్ళడం. హోటల్ కి వెళ్తే ఓ మంచి కాఫీ, దోశ, ఐస్ క్రీం పార్లర్ కి వెళ్తే భేల్పూరి, వెనీలా తినడం, ఉత్తరాలు, హాస్టల్లో పుట్టినరోజు పార్టీలు, రాగింగులు, క్లాసులో లాస్ట్ బెంచ్లో కూర్చొని అల్లరి, బస్సులో అంత్యాక్షరిలు, పరీక్షల్లో నైట్ అవుట్లు.... .....ఇలా బానే గడిచి పోయింది.
అస్సలు కత మొదలైంది చదువు అయినంక....నాకు, మా నాన్నకి చిన్న మాట తేడా వచ్చి నేను ఎంచుకున్న దారిలో నడవడం మొదలు పెట్టాను. కష్టమైనా, నష్టమైనా నేనే పడ్డాను చాలా రోజులు. ఇంట్లో వాళ్ళు కూడా నాతొ పాటుగానే అన్ని అనుభవించారు ఆ టైములో. మనం వాళ్ళని కాదన్నా వాళ్ళు మనల్ని వదులుకోలేరు ఇది ఎవరు నమ్మినా నమ్మక పోయినా అక్షర సత్యం. మా అత్తింటి వాళ్ళు అందరూ వాళ్ళ స్వార్ధం కోసం అందరు బంధువుల్లానే తమ నిజ స్వరూపం చూపించారు. చాలా కొద్ది మంది మాత్రమే వేరేగా వుంటారు, ఇది మానవ నైజం దీనిలో మనం వాళ్ళని తప్పు పట్టడానికి ఏమి లేదు. కాక పొతే నమ్మకం మీద, మానవత్వపు విలువల మీద దెబ్బ కొట్టారు అది మర్చి పోలేను.
నేను నడుస్తున్న దారిలో ముళ్ళు, రాళ్ళు ఏరుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాను....కొన్ని కావాలంటే కొన్నిటిని వదులుకోవాలని పసి పిల్లలని( ఒకటినర్ర , ఆరు నెలల పిల్లలని) అమ్మ వాళ్ళ దగ్గర వదిలి....మరి బతకడానికి డబ్బులు కావాలి కదా!! దేశం కాని దేశం లో ఏదో ఒక తిప్పలు పడి కాస్త నిలదొక్కుకున్నాము. పెద్ద బాబు చచ్చి బతికినా కూడా రాని, కనీసం చూడని అత్తింటి వారికి డబ్బుల అవసరాలు తీర్చి, చిన్న ఆడబిడ్డకు పెళ్లికి డబ్బులు ఇచ్చి, పెళ్లి కుదిర్చి చేస్తే కుడా మామీద ఇంకా కోపమే వాళ్లకి.ఆ పెళ్లి కొడుకు ఆవిడకి నచ్చలేదంట. అది ముందు చెప్పలేదు.నేనేదో అబద్దం ఆ అబ్బాయి జీతం విషయంలో చెప్పానంట. నేను చెప్పలేదు, అడిగితే నాకు తెలియదు నాలుగువేలో,ఐదువేలో నాకు తెలియదు ఫోను నెంబరు ఇదిగో మీరే ఇంకా ఏమైనా అడగదల్చుకొంటే అడగండి అని చెప్పాను. అది జరిగింది. మరిది తోడికోడలు వాళ్ళని అమెరికా మేమే డబ్బులు కట్టి తీసుకు వెళ్లి మూడు నాలుగు నెలలు మా ఇంట్లోనే ఉంచుకుని అన్ని చేస్తే వాళ్ళ అవసరాలు తీర్చుకుని ఈ రోజు మా డబ్బులు పదిహేను లక్షలు ఎగ్గొట్టారు. ఇదండీ బంధువుల రాబందుల గోల!!
ఇక ఉద్యోగం అంటారా!! అది అంతేనండి. పని సంగతి ఏమో కాని రాజకీయాలు బాగా నేర్చుకోవచ్చు. మనం పని చేస్తున్నాము కదా, మళ్ళి దాని గురించి చెప్పడం ఎందుకు? వాళ్లకి తెలుసు కదా!! అనుకుంటాము కాని మనం చేసే పనిని వాళ్ళకిష్టమైన వాళ్ళు చేసారు అని, పని చేసిన మనం ఏమి చేయలేదని, మనకి ఏమి రాదనీ చెప్పడం....ఎవరి దగ్గర నాటకాలు వాళ్ళ దగ్గర వేయడం, చేతలు లేకుండా మాటలు కోటలు దాటించడం...ఇలా మనకు తెలిసిన అనుభవాలే అన్ని. కాదంటారా!! చదివి నవ్వు కుంటున్నారా!! మరి ఇవేనండి నా నాలుగు పదుల అనుభవాల అనుభూతులు కొన్ని.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)