
తరాల అంతరాలను దాటి ఒకటిగా కలిసి
గమ్యాన్ని చేరే గమనంలో ఎందుకీ మార్పు?
నన్ను నన్నుగా ఇష్టపడిన నువ్వు ఒకప్పుడు...
కాల గమనంలో ఎన్నో మార్పులు, కూర్పులు,
ఓర్పుల నిటూర్పులు.......
నీ ఇష్టంలో మార్పుల చేర్పులు ఇప్పుడు
మారని అప్పటి నేను ఈనాడు నీకు నచ్చలేదేమో!!
ఆనాడు ఈనాడు ఏనాడు నీ ఇష్టాన్ని కాదన్నాను కనుక!!
అందుకే నీకు దూరంగా దూరదూరంగా......!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మనసు చంపుకున్న మనుషులు మారినా
బతుకు పంచుకున్న మనసు మారదు.
మారే కాలం మార్పుని తెస్తున్నా
కాలానికి లొంగని ప్రేమ మారదు.
--సత్య
http://neelahamsa.blogspot.com/2011/02/blog-post_09.html
మీరు చెప్పింది బావుంది....నిజమే కదా!!
థాంక్యు సత్యా..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి