15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఓ జాబిలీ....

శ్రీ జే వి రాఘవులు గారు స్వరపరచిన మధుర గీతాలలో ఓ మచ్చుతునక ఈ పాట. సుశీలమ్మ గళ గాన మాధుర్యంలో జాలువారిన అద్భుతం.....
మీరే చూడండి.....
http://www.youtube.com/watch?v=Imb4d0o1LbI&feature=player_embedded

ఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం
ఎదురు చూసింది...నిదుర కాచింది...కలువ నీ కోసమే...
వెలుగువై రావోయీ...వెలుతురే తేవోయీ...

ఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...

కదలిపోయే కాలమంతా నిన్ను నన్నూ నిలిచి చూసే
కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే..
భ్రమర నాదాలు...
భ్రమర నాదాలు ప్రేమ గితాలై పరిమళించేనోయి
పున్నమై రావోయీ...నా పున్నమే నీవోయీ...

ఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...

నవ్వులన్ని పువ్వులైనా నా వసంతం నీకు సొంతం...
పెదవి దాటి ఎదను మితే ప్రేమబంధం నాకు సొంతం..
ఇన్ని రాగాలు...
ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి...
అనురాగమే నీవోయీ... అనురాగమే నీవోయీ...

ఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...
ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి...
అనురాగమే నీవోయీ... అనురాగమే నీవోయీ...
special thanks 2 u

veera murthy (satya) చెప్పారు...

వెన్నెల మీద జాబిలి మీద స్పందించని కవిలేడంటే అతిశయోక్తి కాదు...

http://neelahamsa.blogspot.com/2010/11/blog-post_14.html

చెప్పాలంటే...... చెప్పారు...

అవును సత్య గారు అమ్మ, వెన్నెల, జాబిలీ ఎన్ని కవితలు, కధలు చదివినా, రాసినా ఎప్పుడూ బోర్ కొట్టవు ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటాయి....థాంక్యు
.థాంక్యు సుందర్ గారు టపా నచ్చినందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner