8, ఏప్రిల్ 2011, శుక్రవారం

జీవితం - ఆట

ఆటలో గెలవాలనే ప్రతి ఒక్కరు అనుకుంటారు...కాని ఒక్కోసారి...... ఓడిపోతువుంటారు. మనం ఆడే ప్రతి ఆటలో గెలుపోటములు సహజమే. దైవం మనతో ఆడే ఆటలో కుడా అంతే. గెలుపు ఇచ్చినంత ఆనందం(కిక్) ఓటమి ఇవ్వదు. అలా అని ఆడిన ప్రతిసారి... ప్రతి ఆటలోనూ విజేతలం మనమే కాలేము. ఒక్కసారి గెలిచామని ఇంక ఆడకుండాను ఉండలేము అలా అని ఓడిపోతూనే ఉండము ప్రతిసారి.....ఓడిన ప్రతిసారి మరోసారి గెలవాలన్న తపన, కసి, పట్టుదల పెరగాలి. ఆట అయిపొయింది మనం గెలవలేకపోయామే అనుకోకూడదు....జీవితం కుడా అంతే...సమస్య వచ్చినప్పుడు అయ్యో ఎంత పెద్ద కష్టం వచ్చింది అని బాధ పడుతూవుంటే సరిపోదు దానికి ఏదోఒక ప్రత్యామ్నాయం చూడాలి. జీవితమంతా ఎప్పుడూ కస్టాలు వుండవు అలా అని సంతోషము వుండదు, రెండూ వుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ..ఒకరికి ఉద్యోగం లో సమస్య, మరొకరికి ఇంట్లో, వేరొకరికి డబ్బుల ఇబ్బంది...ఇలా రకరకాల సమస్యలు వుంటాయి. మనం భయపడితే ఇంకా భయపెడతాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే......ఎగసిపడే ప్రతి అల విరిగి పడుతుంది....పడిపోయాను కదా అని మళ్ళి ఎగసిపడటం మానదు కదా!! ఇంకా పైకెగరాలని చూస్తుంది....అది ప్రకృతి సహజం. పడిపోతామని పరిగెట్టడం కాని...నడవటం కాని మానేస్తే అస్సలు చేరాల్సిన గమ్యస్థానం దూరం తరిగి పోదు. ప్రయత్నలోపం లేకుండా మనం కోరుకున్న సంకల్పం కోసం శ్రమిస్తే తప్పక ఫలిస్తుంది...ఎన్ని అవరోధాలు ఎదురైనా మన అడుగు ముందుకే పడాలి, వెనుకంజ ఉండకూడదు....ఎన్నోసార్లు తన ప్రయోగాలు విఫలమైనా నిరాశ చెందకుండా థామస్ ఆల్వా ఎడిసన్ మనకు ఎన్ని అందించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి...ఎందరి శ్రమకు ఫలితమో ఈనాడు మనం అనుభవిస్తున్న స్వరాజ్యం....ఈ సుఖభోగాలు....యోగాలు....!! కలలు కనడం తప్పు కాదు వాటిని నిజం చేసుకోవడానికి ప్రత్నించక పోవడమే మనం చేస్తున్న పెద్ద తప్పు. కృషితో నాస్థి దుర్భిక్షం అన్న లోకోక్తి గుర్తు చేసుకోండి......మొదటి అడుగు వేసేటప్పుడు నీ వెనుక ఎవరు వుండరు, కాని మన అడుగు అటో ఇటో ఎటో వైపు వేయక తప్పదు....అది మనతోపాటు నలుగురికి మంచి చేయగలిగితే చాలు....ఈ జీవితానికి.

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

నిజమండి, సమస్యలు లేని జీవితం ఉండదు బాగా చెప్పారు

చెప్పాలంటే...... చెప్పారు...

మీకు నేను చెప్పింది నచ్చినందుకు ధన్యవాదాలు లత గారు....-:)

శిశిర చెప్పారు...

చాలా మంచి విషయాలు చెప్పారండి.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శిశిర ఏంటి చాలా రోజులుగా సీత కన్నేశారు నామీద!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner