
మొద్దుశీనుని చంపి ముందు టి వి లో అది ఆత్మహత్య అన్నారు అది హత్య అని చిన్న పిల్లాడికి కుడా తెలుస్తుంటే ఇక వేరే దారి లేక హత్య అని ఒప్పుకున్నారు. సూరిని వై ఎస్ ఆర్ ఉన్నప్పుడే వదిలేయాలని చూసారు, కాని విమర్శలకు తట్టుకోలేక సూరి విడుదలను వాయిదా వేసారు. మొత్తానికి సత్ప్రవర్తన అన్న పేరుతొ వదిలేసారు కాకపొతే చావుని ఆపలేకపోయారు. లేకపోతె ఈ సరికి ఇంకో రాజకీయ నాయకుడు జగన్ కి తోడు ఉండేవాడు.
జనానికి ఈ రాజకీయాలు అర్ధమై ఎవడిని నమ్మాలో ఎవడిని నమ్మకకూడదో ఇప్పుడు బాగా తెలుసు. ఈ పనికిమాలిన చర్చలు మానేసి టి వి మీడియా వాళ్ళు జనానికి పనికివచ్చే చర్చలు పెట్టి కొన్ని సమస్యలకయినా పరిష్కారం చూపిస్తే బావుంటుంది. వాడంత తిన్నాడు...వీడింత తిన్నాడు...వాడు వాడిని చంపాడు...ఇలాంటి చెత్త చర్చలు మాని మీడియా గౌరవం పెంచే చర్చలు చేస్తే ఎంతో మేలు.
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కాని మనమేమి చెయ్యగలము .. ఇప్పుడు అన్యాయం అక్రమం రాజ్యం ఏలుతోంది .. మంచి తనం మూగబోయింది ..
మంచి చెయ్యాలన్న మనకి చెడె జరుగుతుంది ..
నిజమే కావ్య గారు చూస్తూ వుండటం తప్ప ఏమి చెయ్యలేక పోతున్నాము....
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి