11, ఏప్రిల్ 2011, సోమవారం

నమ్మకాన్ని పాడుచేసుకోకండి బాలు గారు......

క్రిందటి సోమవారం ఈ టి వి లోని పాడుతా తీయగా ఎపిసోడ్ మొత్తం చూడలేదు ఆ రోజు....కాని నిన్న మొదటి రౌండ్, రెండో రౌండ్ చూసాక బాలు గారు మార్కులు ఎందుకు తక్కువ వేసారో అర్ధం ఐంది. ట్యూన్ లో తప్పులేకుండా పాడినందుకు ఏభైఆరు శాతం వేసారు...పాడేటప్పుడు గాలిని కుడా వినిపిస్తున్నందుకు మొదటి స్థానం ఇచ్చారు. ఎంత బాగా జడ్జ్ చేస్తున్నారో బాలు గారు.....ఎందుకండీ అలాంటప్పుడు పోటిలని ప్రోగ్రాములు పెట్టడం? మీకు ఇష్టమైన నలుగురిని పిలిచి బహుమతులు ఇవ్వండి సరిపోతుంది. అంతకు ముందు మంచి పాటలు పాడటం లేదని మార్కులు ఇవ్వలేదు....ఇప్పుడు ఫీల్ లేకుండా అని ఇవ్వలేదు...పాటలు బాగా పాడే వాళ్ళు ఎవరైనా ఫీల్ తోనే పాడతారు అది బాలు గారికి బాగా తెలుసు. అర్ధవంతమైన తప్పులు చెప్పండి అవి వాళ్ళ భవిష్య సోపానానికి పునాది అవుతాయి, కాని ఇలా మీ మీద వున్న నమ్మకాన్ని పాడుచేసుకోకండి బాలు గారు......

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Devika Sai Ganesh Puranam చెప్పారు...

మీరు రాసింది నూటికి నూరు పాళ్లు నిజం. దమ్ము పట్టలేని వాళ్ళే గెలవబొతున్నారు. బహుశ బాలసుబ్రహమణ్యం గారికి ఏదైనా మొహమాటం ఉందేమో!!!!!!

లత చెప్పారు...

ఎందుకో రాఘవేంద్రకు అసలు సెలెక్షనే చాలా కష్టమైన పాటలు ఇస్తున్నట్టు అనిపించింది
నిజమే నిఖిల వాయిస్ లొ బాగా ఊపిరి శబ్దం వినిపించింది మేఘన బాగా పాడుతోంది

చెప్పాలంటే...... చెప్పారు...

అందరూ చూస్తూనే వున్నారు, నిజానిజాలు తెలుసు కాని... ఏమి చెయ్యలేము దేవిక గారు...
రాఘవేంద్ర కు అలాంటి కష్టమైన పాటలు ఇచ్చినా బాగా పాడాడు ఏమి చెయ్యలేక ట్యూన్ కరక్ట్ గానే పాడావు కాని సినిమాలో లా పాడలేదు అంతే అర్ధం ఎంతో మరి బాలు గారే సెలవియ్యాలి లత గారు

మాలా కుమార్ చెప్పారు...

పాడతాతీయగా ప్రోగ్రాం గురించి మీరు బాగా విమర్శ గా రాస్తున్నారండి . మీ రెవ్యూ బాగుంది .

చెప్పాలంటే...... చెప్పారు...

చూస్తూ ఊరుకోలేక రాస్తున్నాను అండి. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రాం అది కాని బాగా పాడే పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక రాస్తున్నాను కొద్ది గా అయినా బాలు గారు మారతారేమో అని....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner