
పరిమళం ఓ ఆస్వాదన
ఆస్వాదన ఓ అనుభూతి
అనుభూతి ఓ జీవితకాలం
జీవితకాలం ఓ గెలుపు ఓటమి
గెలుపు ఓటమి ఓ ఆట చివరి దశ
ఆట చివరి దశ ఓ జీవిత చరమాంకం
జీవిత చరమాంకం లో
పరిచయాల పరిమళాల ఆస్వాదనానుభూతి
అనంతమైన ఆనందానికి నిలయం!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......
8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా బావుందండి
well said Manju garu
heart touching....
పరిమళాల ఆస్వాదన చాలా బాగుంది . కాని అప్పుడే జీవిత చరమాంకం ఏమిటి ?
థాంక్యు సాయి గారు
లత గారు శైలు & శశి
ఏమో మాలా గారు అనిపించింది రాసాను భయపడకండి బానే వున్నాను థాంక్యు అండి
chaala baagaa raasaaru! :)
థాంక్యు సత్య గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి