29, మార్చి 2012, గురువారం

ఆత్మీయత....ఆలంబన..!!

ఆనందం లో తానై తోడుంటాను అంటుంది
ఆనందభాష్పం....!!
బాధలో ఓదార్పు నేనౌతా అంటుంది....
కన్నీటి చినుకు తుంపర...!!
కష్టంలో ఆసరా తానౌతానంటుంది ....
స్నేహహస్తం..!!
కోపం లో స్వాంతన చినుకునౌతా అంటుంది....
చల్లని మాటల నేస్తం...!!
అన్నిటికి ఆలంబన ఓ మంచి మనసు తోడు...!!
వదులుకుంటే నష్టజాతకం....!!
అందుకుంటే ఆనందనాల హరివిల్లే జీవితం లో...!!

23, మార్చి 2012, శుక్రవారం

నందనశుభాభినందనలు


ఈ నందన నామ సంవత్సరం అందరికి బావుండాలి....అందరూ బావుండాలి.....
ఉగాది శుభాకాంక్షలు.....
మంజు

20, మార్చి 2012, మంగళవారం

అస్వాదన అనుభూతి....!!


కదిలిపోయే కాలంతో పాటుగా
కదలని చెదరని జ్ఞాపకం ఒక్కటైనా చాలు....
వేయి జన్మలకు తోడుగా.....నీడగా....
కడవరకు కలిసిపోయే కమ్మని కలగా...కధగా...
చేదు జ్ఞాపకమైనా...తీపి గురుతులైనా...
మరులు గొలిపే మధుర క్షణాలు....
కంట నీరొలికించే కన్నీటి కావ్యాలు.....
అస్వాదన లోని అనుభూతి అజరామరం..!!

19, మార్చి 2012, సోమవారం

మూలవిరాట్టు

నిన్నటి భారత్, పాకిస్తాన్ క్రికెట్ మాచ్ చూడలేని వారు చాలా చాలా ఆనందాన్ని కోల్పోయినట్లే.....గంభీర్ నిరాశ పరచినా సచిన్ పర్వాలేదు అనుకుంటే చివరి వరకు ఆడిన విరాట్, రాహుల్ ఆటను చూసి తీరాల్సిందే.....వీళ్ళిద్దరే లక్ష్యాన్నిసాదించేస్తారనుకుంటే కాస్తలో ధోని, రైనా కి చాన్స్ ఇచ్చేసారు.....ద్విశతకాన్నిఅందుకుంటాడేమో ఆనుకుంటే విరాట్టుడు కాస్త నిరాశ పరిచాడు.....నిన్నటి ఆటని ఎంతగా ఆస్వాదించామంటే.... అప్పటికప్పుడు టపా రాయాలనిపించింది.....కాని సమయం చిక్కలేదు.....విరాట్టుడు మూలవిరాట్టుడి గా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు...
యువసంచలనం యువరాజ్ కూడా తొందరగా జట్టుకు తోడూ కావాలని మరిన్ని విజయాలు అందుకోవాలని వైఫల్యాలను అధిగమించి ప్రపంచ చాంపియన్స్ కి ఎదురులేదని భారత కీర్తి పతాకాన్ని ఎవరు అందుకోలేరని చాటి చెప్పాలని జట్టు గెలుపుకి పాటుపడే అందరికి అభినందనలు.....

17, మార్చి 2012, శనివారం

చక్రం....!!

ఎవరి కోసం ఆగని కాలచక్రంలో
ఎన్నెన్ని మలుపులో....!!
ముడుల సుడిగుండాలో...!!
కాలచక్రం లో జీవిత చక్రం పరిభ్రమణం..!!
జీవితచక్ర గమనంలో....
కాలంతో పరుగెట్టలేక అలసి సొలసిన జీవితాలు కొన్ని...
కష్టాల కడలి లో గెలుపు తలుపు తడితే
మరొకరికి ఉత్తేజాన్నిచ్చే స్పూర్తి ప్రదాతలు కొందరు....
భాష లేని మాట లేని మనసుల అలజడుల
మౌనగీతాలెన్నో....మనసురాగాలెన్నో..!!
అక్షరాల అష్టపదులెన్నో...!! అనురాగాల అనుబంధాలెన్నో...!!
మమతల ముడులెన్నెన్నో...!!
కష్టాల కడలిలో ఆనందాల అలలెన్నో..!!
కనురెప్పపాటు ఈ జీవితచక్రం లో
కోప తాపాలు ఆనంద విషాదాలు
ఏది శాశ్వతం కాని కాలచక్రంలో....
మరుపే మారని ఔషదం....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner