17, మార్చి 2012, శనివారం

చక్రం....!!

ఎవరి కోసం ఆగని కాలచక్రంలో
ఎన్నెన్ని మలుపులో....!!
ముడుల సుడిగుండాలో...!!
కాలచక్రం లో జీవిత చక్రం పరిభ్రమణం..!!
జీవితచక్ర గమనంలో....
కాలంతో పరుగెట్టలేక అలసి సొలసిన జీవితాలు కొన్ని...
కష్టాల కడలి లో గెలుపు తలుపు తడితే
మరొకరికి ఉత్తేజాన్నిచ్చే స్పూర్తి ప్రదాతలు కొందరు....
భాష లేని మాట లేని మనసుల అలజడుల
మౌనగీతాలెన్నో....మనసురాగాలెన్నో..!!
అక్షరాల అష్టపదులెన్నో...!! అనురాగాల అనుబంధాలెన్నో...!!
మమతల ముడులెన్నెన్నో...!!
కష్టాల కడలిలో ఆనందాల అలలెన్నో..!!
కనురెప్పపాటు ఈ జీవితచక్రం లో
కోప తాపాలు ఆనంద విషాదాలు
ఏది శాశ్వతం కాని కాలచక్రంలో....
మరుపే మారని ఔషదం....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సుభ/subha చెప్పారు...

Nice one!!

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు ధన్యవాదాలు శుభ గారు.....

శోభ చెప్పారు...

"ఏది శాశ్వతం కాని కాలచక్రంలో....
మరుపే మారని ఔషదం....!!"

అక్షర సత్యం మంజు గారూ.. నిజంగా చాలా చాలా బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శోభ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner