30, మే 2012, బుధవారం

ఆమె..!!

అమ్మగా ఆలిగా
అక్కగా చెల్లిగా
హితురాలిగా
సన్నిహితురాలిగా
స్నేహితురాలిగా
ఆత్మీయురాలిగా
అలసిన వేళ ఆలంబనగా
నీ తప్పులలో నీ ఒప్పులలో
అన్నింటా తోడూ నీడగా
నీతోనే తన ప్రపంచమనుకున్న
ీవకళను జీవం లేని శిలను చేసి
ఆమెను నిర్లక్ష్యం చేయ తగునా...!!

29, మే 2012, మంగళవారం

గుండెకు గాయం..!!

గాయం చేసేది మనిషి
గాయపడేది మనసు
గాయానికి మందు కాలం...
కాలం తెచ్చే మరపు....!!
గుండె ముక్కలైతే...!!
గాయం మానుతుంది కాని...
ముక్కలైన గుండె అతికినా
అది అతుకుల బొంతే..!!

28, మే 2012, సోమవారం

మనవి సక్రమ ఆస్థులా..!!

అక్రమ ఆస్థులు అని గోల పెడుతున్నారు ఇంతకు ముందు అవి ఆక్రమ సంపాదన అని గుర్తు రాలేదా!! అందరూ లాభం పొందిన వాళ్ళే కదా ఈ రోజు జగన్ ఒక్కడే దోషి అని అంటున్నారు...!! మనకు లాభం వస్తే వాళ్ళు ఎలాంటి వెధవలయినా చాలా మంచోళ్ళు....మనకు ఎదురు తిరిగితే మాత్రం దోషులు...!!
ఒక్క జగన్ వి మాత్రమే అక్రమ ఆస్థులా...!! మిగిలిన అందరివి సక్రమ ఆస్థులా..!! మరి చట్టం తన పని తను చేసుకు పోడం లేదెందుకో....!! సారా అమ్ముకోవచ్చు...ఇసుక దందాలు చేయవచ్చు....హత్యలు చేయించ వచ్చు...సెటిల్మెంటులు చేయించ వచ్చు అవి అన్ని క్రమ సంపాదనలే..!! మీ అడుగులకు మడుగులు ఒత్తితే క్రమమే అంతా...!! లేక పొతే అన్ని తప్పులు...!! అప్పటి ఒప్పులు ఇప్పుడు తప్పులు....!!
అమ్మగారికి అప్పుడు గుర్తు రాలేదా లేక తెలియలేదా వేల వేల కోట్లు ఎలా వస్తున్నాయో అని..!! పార్టి పెట్టి సొమ్ము బాగా చేసుకుని విలువలను, విధానాలను గాలికి వదిలేసి మీ పంచన పదవి కోసం చేరితే అబ్బో....చాలా మంచివాడు..!! మొన్ననే కదా మరి అల్లుడి ఇంట్లో సొమ్ము దొరికింది మరి దానిపై ఏ మాటా!! లేదు....అందరూ మర్చిపోయారు కూడా..!! అవును కదూ అవి అన్ని సక్రమ ఆస్థులు కదా అందుకే వాటి లెక్కలు అక్కరలేదు...!! అయినా పరాయి వాడేమి కాదు కదా..!! మనవాడే మనం ఎంత చెప్తే అంత..!!
ఈ రోజు రాజకీయాల్లో ఉన్న అందరివి సక్రమ ఆస్థులు...!! సక్రమ సంపాదన....!!
యధా రాజ తదా ప్రజా లెక్కన ఉన్నాం ఈ రోజు ప్రజాస్వామ్యంలో...!!
ఎవరి మనస్సాక్షి కి వాళ్ళకే తెలుసు మనం ఒకళ్ళని అనే ముందు మనం ఏంటో..!! చూసుకోవాలి...!!
ఒక జగన్ కానివ్వండి,,ఒక రాజశేఖర రెడ్డి కానివ్వండి మన అవసరానికి వాళ్ళని వాడుకున్నాము మనము తిన్నాము వాళ్ళు తిన్నారు...కాదంటారా..!!
కేసుల్లోనుంచి బయట పడ్డాము మన తప్పులు కప్పారని ఈ రోజు వాళ్ళని అనకూడదు...!!
జనాల సొమ్ము తినని.. ఒక్క నాయకుడిని చూపించండి...!!
తప్పు మనదే..!! మనం ఎన్నుకునే క్రమం లోనే మోస పోతున్నామో లేక ఏ రాయి అయితే ఏంటిలే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని సరిపెట్టుకుంటున్నామో...!!
కనీసం ఇక నైనా ప్రతి ఒక్కరు ఓ క్షణం ఆలోచిస్తే కాస్త అయినా ప్రయోజనం ఉంటుందేమో..!!

27, మే 2012, ఆదివారం

నువ్వే...నేనైతే..!!

నీ గుప్పెడంత గుండెలో నేనే...!!
నీ మది తలపుల సవ్వడిలో నేనే..!!
నీ మనసు ముంగిట దోబూచులాడేది నేనే..!!
నీ ఏకాంతంలో అలజడి రేపేది నేనే..!!
నీ ఒంటరితనంలో ఆలంబన నేనే..!!
నీ ఆలోచనా తరంగపు అలను నేనే..!!
నీ అన్వేషణా గమ్యం నేనే...!!
నీదంతా నేనే అయినప్పుడు నా సర్వమూ...నువ్వే..!!

26, మే 2012, శనివారం

జవాబు లేని ప్రశ్న..!!

మరణం....!!
జీవితానికి రాజీనామా..!!
మరో జన్మకు పయనం...!!
మరణం లో ప్రశాంతత మరెక్కడా దొరకనిది...!!
వేదన నుంచి విముక్తి...!!
బంధాల నుంచి విరక్తి....!!
అందుకేనేమో...!!
ఒక్కోసారి మరణానికి ఆహ్వానం పలుకుతాము...!!
మరణం అంచుల వరకు వెళ్లి మళ్ళి వెనక్కు వస్తే...!!
అది పునర్జన్మేమో..!!
అదృష్టమో...!!
మరి దురదృష్టమో..!!
దేవునికి మనతో పని ఉన్నదో ఏమో..!!
లేక మన ఖర్మ ఇంకా మిగిలిందేమో...!!
అనుభవించడానికి..!!
జవాబు తెలియని ప్రశ్నగానే మిగిలి పోయింది...!!
ఈ జీవితం...!!

అందని అద్భుతం..!!


ఒంటరితనం వరమో ...!!
ఏకాంతం శాపమో...!!
ఎందరున్నా ఎవరు లేని ఏకాంతం....!!
నిశి రాతిరి నిదురలో నీ తలపులు....!!
కారుమబ్బుల మాటున దాగిన ...
మసక వెన్నెల వెండి వెన్నెలలు కురిపించే క్షణాలు...!!
మనో వీక్షణం నీకై ఎదురు చూసే నిరీక్షణం....!!
నీకోసం పరితపించే ప్రాణం...!!
నిను చూడక నిలవలేనంటున్న మనసు...!!
కోల్పోయిన సాన్నిహిత్యం మళ్ళి దొరికితే..!!
అది మరో అద్భుతమే..!!

22, మే 2012, మంగళవారం

పుట్టినరోజు శుభాకాంక్షలు...

మనసు నుంచి వచ్చే పిలుపు
పిలుపు లోని ఆప్యాయత
ఆప్యాయత లో అనురాగం
అనురాగం లో అభిమానం
అభిమానం లో ఆపేక్ష
ఆపేక్ష తో కలబోసిన మమతలు
అన్ని ఒకచోట కలిస్తే......
అదే శివ...!!
హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు...!!
ప్రేమతో...అక్క

21, మే 2012, సోమవారం

మనిల్లు....!!

అందాల హరివిల్లు
ఆనందాలకు పుట్టినిల్లు
కోపతాపాలకు మెట్టినిల్లు
వలపు వయ్యారాలకు నట్టిల్లు
అనురాగానికి అభిమానానికి సొంతిల్లు
అల్లరికి ఆటపాటలకు...ఆన్నిటికి అదే అదే మన ఇల్లు ..!!
ఎంతటి వారైనా అమ్మకు...ఆమ్మ ప్రేమకు దాసానుదాసులే...!!
కష్టంలో ఓదార్పు...దుఃఖంలో స్వాంతన...!!
అపజయలో ధైర్యం... గెలుపులో గొప్పదనం...!!
ఎన్నేళ్ళైనా...ఎన్నాళ్ళైనా...అమ్మ అమ్మే..!!
అమ్మ ఒడిలోని వెచ్చదనం ఏ విలువలకు అందనిది...!!
అన్నిటికి ఊరట అమ్మ ఒడే..!!
లాలి పాడినా జోల పాడినా దెబ్బలేసి బుద్దులు చెప్పినా...
దేనికైనా చిరునామా ఈ సృష్టి లో అమ్మ ఒడి....!!

20, మే 2012, ఆదివారం

పుట్టినరోజు శుభాకాంక్షలు

విరించినై విరచించితిని అని సిని ప్రస్థానంలో అడుగు పెట్టి ఆనాటి నుంచి
ఈనాటి వరకు ఎన్నో పాటలను మనకందించి...
ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న
మనసెరిగిన సమాజ కవి మన సిరివెన్నెల గారు...
నాటి నుంచి నేటి వరకు నవరసాలను హృద్యంగా
అక్షరాలలో అందంగా చెప్పగలిగిన కవిరాజు...
తనకంటూ ప్రత్యెక శైలి ని... ప్రతి పాటలోనూ పాట
నాదేనేమో ఆని అనుకునేంతగా మనకు అనిపించేటట్లు రాయగలిగిన
కొద్దిమంది కవి రాజులలో ఒక్కరు....మన సిరివెన్నెల...!!
నాకెంతో ఇష్టమైన పాటల శాస్త్రవేత్త శ్రీ సిరివెన్నెసీతారామ శాస్త్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

15, మే 2012, మంగళవారం

నీతో.....!!

నాలో నేను ఉన్నా ఎప్పుడు....నీతోనే...!!
నేనున్నది నీతోనే...నేనన్నది నీకోసమే..!!
నీలో నేను లేనే లేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ....!!
ఎప్పటికైనా ఉంటానేమో...తెలియదే ఎన్నటికి...!!
చెప్పలేని భావాలకి రూపం తెలియకుంది....!!
చెప్పగలిగే మాటలకి వినలేని మనసే సాక్ష్యం..!!
మనసు అలజడికి మౌన సాక్ష్యం...నువ్వే...!!
మసిబారిన జ్ఞాపకాలకు మరో రూపం..నువ్వే..!!
నా కన్నీటి తడి నిను చేరలేదెన్నటికి....
గుండె సవ్వడి వినలేని నీకు కంటి తడి తెలిసేదెలా..??
అక్షరాలకు అర్ధమే తెలియని అయోమయం...!!
నీటిమీది రాతలకి...మదిలోని ఆశలకు...కలల సాకారమే మధుర సుగంధం...!!

13, మే 2012, ఆదివారం

అమ్మ ఋణం....!!


అమ్మల రోజు అని సంవత్సరానికి ఒక రోజు గుర్తు చేసుకోవడం కాకుండా....
మన ప్రేమనంతా ఆ ఒక్క రోజుకే పరిమితం చేయకుండా....
మన ప్రేమను రాతలకు బొమ్మలకు పరిమితం చేయకుండా...
వెలకట్టలేని విలువైన దేవుడిచ్చిన ఎనలేని సంపద అమ్మ...
తను కరిగిపోతూ మనకు జీవితాన్నిచ్చేది అమ్మ..
ప్రతి క్షణం అమ్మను అమ్మగానే చూసుకుందాం....
ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది ఆమ్మ ఋణం...
అది ఎప్పటికీ తీరని రుణమే...!!
ప్రపంచం లోని ప్రతి తల్లికి వందనం....!!

10, మే 2012, గురువారం

సమస్య....??

మనలో చాలా మంది ఆనుకుంటూ వుంటారు "నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు" "నన్నే ఇబ్బంది పెడుతున్నారు, నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు" అని....కాని పడే వాళ్లకు తెలుస్తుంది ఇబ్బంది పడుతున్నారో..!! బాద పడుతున్నారో..!! పెద్దలు లేకుండా మనం ఈరొజు లేము. పిల్లలు చూడని పెద్దల గురించే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము కాని కొంత మంది పెద్దలు కూడా పిల్లలను బాదపెట్టాలని అనుకోకుండా అంటే వాళ్లకు తెలియకుండా తెలిసి ఇబ్బంది పెడుతూనే వుంటారు...చెప్తే ఏమనుకుంటారో చెప్పక పొతే ఇంకా ఎక్కువ అవుతుందేమో..!! అని పిల్లలు...పట్టించుకోవడం లేదని పెద్దలు...అన్ని చేస్తున్నాము కదా ఇంకా ఎందుకు
అసంతృప్తి అనుకుంటూ పెద్దల అసహనానికి కారణాలు తెలియక అయోమయంలో వుంటారు.పెద్దలు పిల్లలకు మార్గ దర్శకులుగా మంచి దారిలో నడిపించాలి. పిల్లలు పెద్దలు చూపిన దారిలో నడవాలి....కాని ....సమస్య వస్తే పెద్దల సలహా తీసుకునే పిల్లలకు పెద్దలే సమస్యగా మారితే..??
ఇలా ఏమి తెలియని...ఏమి చేయలేని ఆచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్న కొన్ని జీవితాలు ఏ ముగింపుకు చేరతాయో..!!

6, మే 2012, ఆదివారం

నిన్నేమని పిలవాలి..??

జీవితాన్నిచ్చిన జీవికి జీవితమే లేకుండా చేస్తే..??
మనిషిగా నిలబెట్టిన మనిషిని మరణానికి దగ్గరగా చేరిస్తే..??
వెలకట్టలేని విలువను ఆపాదించిన వారిని వెలివేస్తే..??
ఏమి లేని..ఎవరు లేని నీకు అన్ని తానైతే...!!
అన్ని వున్న తనని.....
ఏమి లేకుండా...ఎవరు లేకుండా చేస్తే...??
నీ కోసం అన్ని వదులుకున్న మనిషికి
నువ్వు ఏమి లేకుండా చేస్తే...??
నీ కోసమే తను జీవిస్తుంటే.....!!
తనకోసం తప్ప అందరి కోసం పరితపించే
నిన్ను ఏమని పిలవాలి..?? ఎవరని అనుకోవాలి...??

3, మే 2012, గురువారం

మూగబోయిన జాబిలమ్మ.....!!


ఊసులాడే జాబిలమ్మ మూగబోయింది ఎందుకోమరి....
ఊసులదిగేవారు లేకో...ఏమో.
 ఊహలకందకో ఏమో..
రేయి గడిచినా...పగలు గడిచినా...ఆగని కాలం
ఆనందవిషాదాలను సమంగా మోస్తూనే వుంటుంది
మరపు మత్తులో మాయలో ముంచుతూనే వుంటుంది
జలతారు మబ్బుల పరదాలను దాటి
వెండి వెన్నెల వెలుగులను అందించి
శూన్యమైన నిశీధి నీడలలో...
కమ్మని ఊసులు కనులకు కట్టినట్లుగా
వినసొంపుగా వినిపించవమ్మా....
ఊసులాడే ఓ జాబిలమ్మా..!!

2, మే 2012, బుధవారం

నాలోని నువ్వు..!!



వద్దంటే మాటల ప్రవాహఝరి
చెప్పమంటే మౌనమే నీ సమాధానం
నీ మదిలోని ఉసులు తెలియాలంటే...??
కలల అలజడి ఉహల ఉప్పెనై కమ్మేస్తుంటే...
మనసు మాట వినాలని తపిస్తుంటే....!!
భాష లేని భావం తెలియని అంతరంగ తరంగం
నిలువెత్తున ముంచుతుంటే....!!
మనసు పలికే భాష కి అక్షర రూపం ఇస్తే....!!
అది నేనో లేక నాలో వున్న నువ్వో!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner