15, మే 2012, మంగళవారం

నీతో.....!!

నాలో నేను ఉన్నా ఎప్పుడు....నీతోనే...!!
నేనున్నది నీతోనే...నేనన్నది నీకోసమే..!!
నీలో నేను లేనే లేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ....!!
ఎప్పటికైనా ఉంటానేమో...తెలియదే ఎన్నటికి...!!
చెప్పలేని భావాలకి రూపం తెలియకుంది....!!
చెప్పగలిగే మాటలకి వినలేని మనసే సాక్ష్యం..!!
మనసు అలజడికి మౌన సాక్ష్యం...నువ్వే...!!
మసిబారిన జ్ఞాపకాలకు మరో రూపం..నువ్వే..!!
నా కన్నీటి తడి నిను చేరలేదెన్నటికి....
గుండె సవ్వడి వినలేని నీకు కంటి తడి తెలిసేదెలా..??
అక్షరాలకు అర్ధమే తెలియని అయోమయం...!!
నీటిమీది రాతలకి...మదిలోని ఆశలకు...కలల సాకారమే మధుర సుగంధం...!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జలతారు వెన్నెల చెప్పారు...

ఈ కవితతో మమ్మల్ని మాత్రం బాగా కదిలించారు మంజులగారు. మీకు అన్ని విధాలా మంచి జరగాలని ఆశిస్తూ!

Kalyan చెప్పారు...

@మంజు గారు
లోన గెలిచి బైట ఓడిపోయే ప్రేమ కన్నీటి ధారలా వస్తూ ఎప్పటికి ఆగకుండా ఎదురుచూస్తుంటుంది .... ఆ ఎదురుచూపులు ఫలిస్తాయో చెప్పలేము కాని ఆ ప్రేమ మాత్రం పవిత్రమై ఎప్పటికైనా నిజమౌతుంది.... బాగుంది అని చెప్పడం కన్నా మాచే ఆ ప్రేమ గెలవాలి అనిపించింది మీ కవిత ...

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా సంతోషం వెన్నెల, కళ్యాణ్

భాస్కర్ కె చెప్పారు...

emundandi, kavithalu raasthuuu vundaatame,
keep writing.

చెప్పాలంటే...... చెప్పారు...

sure andi :)
thanks for u'r comment

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner