12, జులై 2012, గురువారం

నీ చుట్టూనే....!!

చిటపట చినుకుల సవ్వడి
వీచే గాలుల అలజడి
మెత్తగా గమ్మత్తుగా వుంటే..!!
కూనిరాగాల కోయిలమ్మల కోమల గీతాలు
కమ్మగా వీనుల విందు చేస్తుంటే..!!
ఎక్కడో దూరంగా వినిపించే
లేగదూడల మెడలో మువ్వల సడి
మృదు మంజీర నాదం లా హాయిగా అనిపిస్తుంటే ...!!
ఏదో తెలియని భావనా తరంగపు అలల తాకిడి
ఊపిరాడనివ్వని మరో ప్రపంచం లో...
చుట్టుముట్టే ఆలోచనా తరంగాల
అంతరంగపు మరో కోణం...!!
నీ చుట్టూనే తిరుగుతోంది...!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

the tree చెప్పారు...

అంతరంగపు మరో కోణం...!!
నీ చుట్టూనే తిరుగుతోంది...!!
chakkaga raasaarandi,
keep writing.

Sai చెప్పారు...

చాలా బాగుంది అండీ..

జలతారు వెన్నెల చెప్పారు...

అచ్చం మంజు గారి కవితలా చక్కగా ఉంది..
:))

శ్రీ చెప్పారు...

నిజంగా మత్తుగా గమ్మత్తుగా ఉంది..:-)
బాగుంది మంజు గారూ!
@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా సంతోషం భాస్కర్ గారు మీకు నచ్చినందుకు
నచ్చినందుకు సంతోషం సాయి గారు ..

.అవునా శ్రీ థాంక్యు ,

నిజమా ... వెన్నెల థాంక్యు.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner