18, జులై 2012, బుధవారం

అందరికి అభివందనాలు..!!

ఎప్పటి నుంచో...చదివిన చందమామ, బాలమిత్ర కధలు.. రాధాకృష్ణ నుంచి చదవడం మొదలు పెట్టిన వారపత్రికలలో సీరియల్సు ఇలా చదివి చదివి ఒకసారి ...
కోపాన్నికధగా రాసినప్పుడు అక్కలు చూసి నీ కధే రాసావే...!! అంటే అయ్యో వీళ్ళకెలా తెలిసిపోయిందబ్బా...!! ఆని బోల్డు ఆశ్చర్యం ..!! నేస్తాలకి ఉత్తరాలతో రాతలు రాయడం మొదలు....మద్య మద్యలో కవితలు...అలా మొదలయ్యి ఇప్పటి కాలానికి మెయిల్స్ తో సరిపెడుతూ...ఇదిగో...ఇలా బ్లాగు...టపాలు...నా రాతలు సాగుతూ వున్నాయి.
బ్లాగు మొదలు పెట్టి మూడున్నర్ర ఏళ్ళు అయినా రాతలు మొదలెట్టి మూడు ఏళ్ళు అనుకుంటా..!! మొదట్లో అందరి బ్లాగులు చూస్తూ ఆమ్మో భలే బాగా రాసేస్తున్నారు బోల్డు మంది చూస్తున్నారు...నాది అస్సలు ఒకరైనా చూస్తారో లేదో ఒక్క కామెంట్ అయినా టపాకి వస్తుందో రాదో అని అనుకునేదాన్ని...నాకు అనిపించింది రాయోచ్చో లేదో అని అనుమానమే..!!
భయపడినా మొత్తానికి రాయడం ఆపలేదు...అలా మొదలు పెట్టిన రాయడం ఇప్పటికి ఆవి ఇవి అన్ని....ఈ టపాతో పాటుగా కలిపి ఓ మూడు వందల టపాలు నా బ్లాగులో చేరిపోయాయి....!!
చెప్పలేని సంతోషమయినా...
తట్టుకోలేని బాధయినా...
పంచుకోగలిగిన ప్రియ నేస్తం....!!
ఆదరించే అమృత హృదయాలు....
ఓదార్పునిచ్చే పన్నీటి పలుకులు....
ముఖ పరిచయం లేకుండా....
మనసు తెలుసుకునే నేస్తాలు....!!
ఏది రాసినా...ఎలా రాసినా...!!
బావుందనే... మెచ్చుకోలు...!!
ఆదరిస్తున్న అందరికి అభివందనాలు..!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జలతారు వెన్నెల చెప్పారు...

మీరు ఒక విషయం చెప్పలేదు.. మీ కవితకు వచ్చిన మొదటి బహుమతి..
:)) మీరు రాస్తూ ఉండండి. నేను చదువుతూ ఉంటాను. అంతే!!

చెప్పాలంటే...... చెప్పారు...

thank u vennela garu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner