2, జులై 2012, సోమవారం

ఆ క్షణం..!!

చెప్పకనే చెబుతోంది నీ మౌనం...!!
మౌన తటాకంలో కలల తరంగం ...!!
మత్తుగా గమ్మత్తుగా ఉన్న...
కనిపించి కనిపించని నీ రూపం...!!
విరిసి విరియని మొగ్గలలో
కిలకిలలాడే నీ చిరునవ్వు...
తుషారమై నను తాకిన క్షణం....!!
మసక చీకటిలో ఒక్కసారిగా....
పండువెన్నెల పరచుకుంటే...!!
జాలువారిన జాబిలి సొగసులు...!!
కనువిందు చేసే కలువల కెంపులు ...!!
ఎటుచూసినా నిన్నే తలపిస్తుంటే...!!
నిన్ను చూడాలని .....
నిలువనీయని మది మారాము చేస్తుంటే
కనుల నిండిన నీ చిత్రం....!!
రెప్ప పడితే కనురెప్ప చాటున
కనుమాయమౌతుందేమో..!! అని
కన్ను మూయటమే మరచిపోయాను...!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సీత చెప్పారు...

భలే ఉంది బాగ రాసారు మంజు గారు...

శ్రీ చెప్పారు...

చాలా బాగుంది మంజు గారూ!
కన్ను మూయటమే మరిచాను....
చక్కని భావం...
అభినందనలు...
@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు అండి శ్రీ మరియు సీత

భాస్కర్ కె చెప్పారు...

chaalaa chakkaga raasaarandi,
last line , nice one.
keep writing.

Sai చెప్పారు...

చాలా బాగా రాసారు మంజు గారు...

జలతారు వెన్నెల చెప్పారు...

ఎప్పటిలా చక్కగా ఉంది మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

సాయి గారికి , భాస్కర్ గారికి, వెన్నెల గారికి నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner