మరో మాట ...
మొన్న ఒక రోజు జనవరి 23 న తెల్లవారుఝాము 2. 45 కి నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది ... పొద్దునే చూసా ..
"Ur poetry is promising *go on @my saint #SAGAR SRIRAMAKAVACHAM ...."
అని అది చూసి ఎవరో అనుకున్నా ఆ సమయలో పెడితే ఏమోలే అని ఊరుకుని కాస్త ఆగి ఫోన్ చేశాను ... తీయలేదు మల్లి వారే చేసారు ... మీ కవిత్వం చదివాను చాలా బావుంది అంటే పుస్తకం ఎక్కడిది అని అడిగాను కలిమిశ్రీ గారి వద్ద తీసుకున్నాను ... మీది సరైన కవిత్వం రాయడం మానకండి .. ఈ రోజుల్లో ఇలాంటి కవిత్వం కోసం చూస్తున్నాము ... నేను , శివారెడ్డి ఇద్దరమూ అదే అనుకున్నాము అన్నారు ... నాకు ముందు ఎవరో తెలియక పోయినా తరువాత అర్ధం ఐంది ... నేను నా పుస్తకం అసలు చదవరు అనుకున్న గొప్ప వ్యక్తులు చదవడమే కాకుండా ... రోజు 4,5 పేజీలు రాయండి మానవద్దు అంటే మనసులో ఆనందం భలే వేసింది కాని ఉన్న నిజం చెప్పాను .. రాకుండా రాయలేనండి అని ... ఆయన చెప్పింది ఒక మాట చెప్తున్నాను ...
" మనసు బావుంటే మనిషి బావుంటాడు తద్వారా సమాజం బావుంటుంది " అంతే కాని మనం వేరేగా ఉంటూ సమాజాన్ని ఏమి ఉద్దరించలేము అన్నది నాకు అర్ధం ఐంది ...
నా ప్రియ నేస్తం వాణి గారు, కత్తిమండ ప్రతాప్ గారు, భవభూతి శర్మ గారు, రాజారాం గారు నా అక్షరాలకు చక్కని ఆకృతిని మీ అందరి ముందు ఉంచారు ఇంతకు ముందు ... విశాఖ సంస్కృతి వారు మొదటి సమీక్షను అందించారు ... రేపటి కోసం పత్రికకు , మల్లెతీగ అధినేత కలిమిశ్రీ గారికి ... అందరికి ... నా కృతజ్ఞతలు ...
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి