1, ఫిబ్రవరి 2016, సోమవారం

శిధిల శిల్పమై నిలిచాను ... !!రాయలేని అక్షరాలు ఎన్నో
చలనం లేకుండా పడి ఉన్నాయి
ఎటూ పోలేక బందీలుగా

కదిలే మదిలో భావాలెన్నో
నైరాశ్యపు నిరీక్షణలో ఎదురుతెన్నులౌతూ
చిరునవ్వు చాటుగా దాగుంటూ

మౌనాన్ని వీడని క్షణాలెన్నైనా
నిశబ్దంలో వినిపించిన నీ పిలుపులై
పలకరించినట్లుగా తాకుతూ

వేదన నాదైనా వేకువ నీదంటూ
గ్రహణం నాకని జ్ఞాపకం నీకొదిలివేసి 
శిధిల శిల్పమై నిలిచాను ... !!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ఎంతకాలమీ పైత్యపు తవికలు రాస్తారు బయ్యా. కొంచెం కూడా బోరు కొట్టదా.

చెప్పాలంటే...... చెప్పారు...

miku bore kodite chadavadam maneyaandi kaadanedevaru :)

vemulachandra చెప్పారు...

రాయలేని అక్షరాలు ఎన్నో మది బందీలయ్యి
చిరునవ్వు చాటు దాగుడుమూతలయ్యి నైరాశ్యపు నిరీక్షణలో ఎదురుతెన్నులౌతూ
నిశబ్దంలో వినిపించిన నీ పిలుపు పలకరింపులయ్యి
జ్ఞాపకాలను మాత్రం నీకొదిలివేసి ఇలా శిధిల శిల్పమై నిలిచి .... ఇక్కడ ఇప్పుడు ఇలా
చక్కని ఆలోచనాత్మక వచన కవిత
అభినందనలు మంజు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

chakkani mi spandanaku vandanalu chandra garu .. kodarikemo peru cheppukodaniki kudaa dhairyam leka vari ishtam vachina ratalu rastu untaru .. adi vari kharma :)

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner