మోపలేని భారాన్ని
మదిలో దాయలేక
గతజన్మలో అలవాటైన
అక్షరాన్ని ఆసరాగా
అంది పుచ్చుకుంటూ
అల్లరిగా కాగితాన్ని
అటుఇటు నలుపుతూ
ఆడుతూ పాడినప్పుడు
తెలియనే లేదు ...
ఆ మమకారపు సవ్వడి
నైరాశ్యాన్ని పారద్రోలి
నిశీధిలో సైతం వెలుగు పూలు
విరజిమ్మే వింత శక్తినిస్తుందని
రాయలేని కలానికి
మనో వీక్షణం అవుతుందని
చరిత్రలో ఓ చిరిగిన పేజీ అయినా
ఈ అసమర్ధపు జీవిత పోరాటంలో
అహానికి సమాధానంగా నిలుస్తుంది....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అల్లరిగా కాగితాన్ని అటుఇటు నలుపుతూ ఆడుతూ పాడినప్పుడు తెలియదు .... అక్షరం ఆసరాగా ఆ కాగితమే తోడు అవుతుంది అని మోపలేని భారం దించుకోవడానికి
రాయలేని కలానికి మనో వీక్షణం అయ్యి నిశీధిలో సైతం వెలుగు పూలు విరజిమ్మే వింత శక్తినిస్తూ అహానికి సమాధానంగా నిలుస్తుందని .... నుకోలేదు
ఒక చిరిగిన కాగితం పేజీ
ఎంత చక్కని సున్నిత మనోభావన
అభినందనలు మంజు గారు
dhanyavadalu chandra garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి