ఎన్నోరోజుల తరువాత బోలెడు కబుర్లు ఉన్నా కాసిని సందడి కబుర్లతో ఇలా ....
జ్ఞాపకాలు, అనుభూతులు, ఆప్యాయతలు .... అన్నవి మనం ప్రతి క్షణం మాట్లాడుకుంటేనో లేదా కలసి ఉంటేనో అని అనుకోనక్కర లేదు . ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఓ సెకను పలకరింపు లేదా గుర్తు చేసుకోవడం అన్నది లేని జీవితాలు ఏం కోల్పోతున్నాయో ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎవరికీ పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు.
నాలుగు గోడలకే పరిమితమైన కొన్ని నెలల కాలంలో ఇప్పటి యంత్రాల పకరింపులు( ఫోన్, ఎఫ్.బిలు లాంటివి ) లేక పోయినా ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదంటే ఎవరైనా నమ్మగలరా..!!
అస్సలు సమయమే లేదు అన్నది మనని మనం మోసం చేసుకోవడమే.
ఒకప్పటి గడచిన జ్ఞాపకాల అల్లరి సందడితో ఉన్న కొద్దిసేపైనా కొన్ని సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదువుల సరదా పిలుపుల కాలాన్ని నా కళ్ళ ముందుకు సజీవంగా తెఛ్చి నాకు మళ్ళి బోలెడు సంతోషాన్ని స్నేహితులరోజుకు ఒకరోజు ముందుగానే నాకు కానుకగా మూటగట్టి ఇఛ్చిన అప్పటి అల్లరి నేస్తాలు, చల్లని స్నేహం స్పర్శ ఎప్పటికీ ఇలా నా సొంతమే కావడం అన్నది ఎన్ని జన్మల పుణ్యమో మరి. అందరి రూపాలు చూపలేక పోయినా ప్రతి ఒక్క నేస్తం ఎప్పటికీ నాకు దగ్గరే.
ఆత్మీయ నేస్తాలు శారద, ఉమ, శోభ, నీరజ, అందరిని కలిపి అల్లరి చేసే అనిత, అను, మమత, కవిత, మంజు, నీలిమ .... ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడే..... కొందరితో సంతోషం కాదు అందరిలో సంతోషం నింపితే అది కలకాలం అలానే సజీవమై ఉండి పోతుంది ... ఎన్ని జన్మలకైనా దాని పరిమళం తరిగిపోదు. ఇదేనేమో మనసుల మమతల నెయ్యం.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి