ముక్కుమొహం తెలియని ఎందరో ఉన్న కొద్దిపాటి పరిచయంలోనే కాసింత ఆత్మీయతను అందిస్తారు. నీతులు చెప్తూ కోతలు కోసే చాలా మంది మాత్రం కనీసం ఓ మాట అడగడానికి కూడా తమ సమయాన్ని వృధా చేసుకోరు. ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా పలకరింపుకి ఓ క్షణం సరి పోతుంది. ఎవరి జీవితాలు వారివి అయినా అనుబంధాలను మర్చిపోకుండా ఎప్పుడో ఒకసారి అయినా మన గత జ్ఞాపకాలు గుర్తుకి వచ్చినా, లేదా మనం పొందిన సాయం గుర్తు చేసుకున్నా చిన్న పలకరింపు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆపదలో కనీసం పలకరింపుకి నోచుకోని స్నేహాలు, బంధుత్వాలు ఎందుకు..? జనంలో ఉంటున్నామో, జనారణ్యంలో ఉంటున్నామో తెలియని రోజులుగా ఇప్పటి మనిషి నైజాలు మనల్ని అయోమయంలో పడవేస్తున్నాయి. డబ్బు అనేది అవసరానికి పనికి వస్తుంది కానీ అన్ని తీసుకురాలేదు. అలానే మనం ఓ మాట చెప్పాలి అనుకుంటే ముందు మనం అది ఆచరించి తరువాత చెప్తే బావుంటుంది. దేవుడు నాకిచ్చిన ఎంతో మంది ఆత్మీయుల ముందు ఒకటి అరా తక్కువైనా ఆ లోపాన్ని నాకు తెలియనీయకుండా నన్ను అభిమానించే అందరికి కృతజ్ఞతా వందనాలు.
2009 డిసెంబర్ లో మొదలైన నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 1300 పై చిలుకు పోస్టులు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోనికి అడుగు పెడుతున్న సందర్భంలో నన్ను నా కబుర్లను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Wish you all the best
Thank u so much andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి