3, ఏప్రిల్ 2021, శనివారం
గుండె చప్పుళ్లు
ఓ తప్త హృదయం చేసిన అక్షర సవ్వడే ఈ " గుండె చప్పుళ్లు "
మనసు తడి గుండెకంటి ఆ చెమ్మ కంటిని చేరి అక్షర బాష్పమై వెలువడిన భావనలే ప్రమెాద్ ఆవంచ గారి " గుండె చప్పుళ్లు " కవితా సంపుటి నిండా పరుచుకుని ఉన్నాయి. కవిత్వమంటే మనసు స్పందనకు ప్రతిరూపమే.క్లిష్టమైన పద సమాసాలు, అర్థం లేని అలకారాలు, అంత్యానుప్రాసలుంటేనే గొప్ప కవిత్వం కాదు. చదివిన నాలుగు పదాలు మనసుకు హత్తుకుంటే చాలు. ఆ కవిత్వం నాలుగు కాలాలు పదుగురి గుండెల్లో పదిలంగా ఉంటుంది. ఈ " గుండె చప్పుళ్లు " కవితా సంపుటి అలాంటిదేనని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అక్షరాలను ఆసరాగా చేసుకుని తన మనసుని అద్దంలో మనకు చూపించారు.
" నిన్ను వెతుక్కుంటూ
నన్ను నేను తప్పిపోయాను " అనడంలో మనకు అనంతమైన ఆరాధన నిండిన ప్రేమ కనిపించడం లేదూ..! ఇలాంటి ఆర్ద్రత నిండిన భావాలు కోకొల్లలుగా మనకు తారసపడతాయి.
" నువ్వు రాలేదు కానీ
నీ నిరీక్షణలో పుట్టుకొచ్చిన
పదాలు కవితలయ్యాయి " అంటూ
దూరమైన బంధాన్ని తలవని క్షణం లేదని, అక్షరాలతో అభిషేకించడమే తనకు తెలిసిన విద్యగా నిరూపించారు తన " గుండె చప్పుళ్ల" తో.
జ్ఞాపకాలకు రేపనేది లేదని, నిన్నటిలోనే జీవించడానికి ఇష్టపడతాయని, వియెాగం చేసే గాయాలే జ్ఞాపకాలై వేధిస్తాయని, నేల మీద మట్టివై నువ్వు నా వళ్ళంతా అతుక్కుపోయావు అన్నా, నాలో నిన్ను బతికించుకుంటూ నేను బతికేస్తున్నా.. అవును మరి నేను స్వార్థపరుడినే అనడంలోనూ గుండె నిండా నిండిన ప్రేమ కనబడుతుంది. కల్లోలమైన మనసుకు కన్నీళ్ళ స్వాగతాలు పలకడంలోని బాధను, ఎడబాటులోని ఒంటరితనపు వేదనను, కలలు మిగిల్చిన కలతల కన్నీళ్ళను, మనిషి,మనసు అవస్థ కవితగా ఎలా మారుతుందో...ఇలా ఎన్నో మనసును హత్తుకునే కవితల సమాహారమే " గుండె చప్పుళ్లు ".
" కాలం చేజార్చిన జీవితపు అద్దం
పగిలి ముక్కలైంది "
తాత్వికత నిండిన జీవితపు అనుభవసారమిది.
" పగలంతా
బాధ్యతల బరువు
రాత్రంతా
నన్ను నేను అన్వేషించుకుంటూ
నిన్ను చేరే ప్రయత్నంలో.."
గతానికి, వాస్తవానికి మధ్యన నలుగుతున్న మనసు తపన ఇది.
" గుప్పెడు అక్షరాలతో గంపెడు ప్రేమను
కలిపి రాసిన నా మనసు పుస్తకం
మన తరాలకు ప్రేమతత్వాన్ని
బోధిస్తుంది "
ఈ వాక్యాలు చాలు ఈ కవితా సంపుటి నిండా ఏముందో చెప్పడానికి. మన తరాలకేంటి తరువాత పది తరాలకు కూడ బంధం విలువ, ప్రేమ గొప్పదనం తెలుపుతుంది.
ఇవే కాకుండా అన్నీ నేర్పిన నాన్న తనను మర్చిపోయి ఉండటమెలాగో నేర్పలేదని వాపోతారు నాన్న యాదిలో కవితలో. జ్ఞాపకాలను పదిలం చేసుకున్న గుండె చప్పుడును, మహిళ గొప్పదనాన్ని,
చెదిరిన కలను, జీవిత పుస్తకాన్ని, మది అంతర్మధనాన్ని, చేజారిన కలలను, చెక్కిలిని తడిపిన కన్నీళ్ళను తన అక్షరాలతో మన మనసులను కూడా చెమ్మగిల్లేటట్లు చేసిన ప్రమెాద్ ఆవంచ గారి " గుండె చప్పుళ్లు " కవితా సంపుటికి హృదయపూర్వక శుభాభినందనలు. కనబడని మనసు స్పందనను పదిమంది మెచ్చే కవిత్వంగా మలచడమే కాకుండా, తన మనసుతో రాసి అందరి గుండెలను చప్పుడు చేయించిన ఈ " గుండె చప్పుళ్ళు " కు అభిమానంతో నన్నూ నాలుగు మాటలు రాయమన్నందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
మంజు యనమదల
విజయవాడ
"
మనసు తడి గుండెకంటి ఆ చెమ్మ కంటిని చేరి అక్షర బాష్పమై వెలువడిన భావనలే ప్రమెాద్ ఆవంచ గారి " గుండె చప్పుళ్లు " కవితా సంపుటి నిండా పరుచుకుని ఉన్నాయి. కవిత్వమంటే మనసు స్పందనకు ప్రతిరూపమే.క్లిష్టమైన పద సమాసాలు, అర్థం లేని అలకారాలు, అంత్యానుప్రాసలుంటేనే గొప్ప కవిత్వం కాదు. చదివిన నాలుగు పదాలు మనసుకు హత్తుకుంటే చాలు. ఆ కవిత్వం నాలుగు కాలాలు పదుగురి గుండెల్లో పదిలంగా ఉంటుంది. ఈ " గుండె చప్పుళ్లు " కవితా సంపుటి అలాంటిదేనని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అక్షరాలను ఆసరాగా చేసుకుని తన మనసుని అద్దంలో మనకు చూపించారు.
" నిన్ను వెతుక్కుంటూ
నన్ను నేను తప్పిపోయాను " అనడంలో మనకు అనంతమైన ఆరాధన నిండిన ప్రేమ కనిపించడం లేదూ..! ఇలాంటి ఆర్ద్రత నిండిన భావాలు కోకొల్లలుగా మనకు తారసపడతాయి.
" నువ్వు రాలేదు కానీ
నీ నిరీక్షణలో పుట్టుకొచ్చిన
పదాలు కవితలయ్యాయి " అంటూ
దూరమైన బంధాన్ని తలవని క్షణం లేదని, అక్షరాలతో అభిషేకించడమే తనకు తెలిసిన విద్యగా నిరూపించారు తన " గుండె చప్పుళ్ల" తో.
జ్ఞాపకాలకు రేపనేది లేదని, నిన్నటిలోనే జీవించడానికి ఇష్టపడతాయని, వియెాగం చేసే గాయాలే జ్ఞాపకాలై వేధిస్తాయని, నేల మీద మట్టివై నువ్వు నా వళ్ళంతా అతుక్కుపోయావు అన్నా, నాలో నిన్ను బతికించుకుంటూ నేను బతికేస్తున్నా.. అవును మరి నేను స్వార్థపరుడినే అనడంలోనూ గుండె నిండా నిండిన ప్రేమ కనబడుతుంది. కల్లోలమైన మనసుకు కన్నీళ్ళ స్వాగతాలు పలకడంలోని బాధను, ఎడబాటులోని ఒంటరితనపు వేదనను, కలలు మిగిల్చిన కలతల కన్నీళ్ళను, మనిషి,మనసు అవస్థ కవితగా ఎలా మారుతుందో...ఇలా ఎన్నో మనసును హత్తుకునే కవితల సమాహారమే " గుండె చప్పుళ్లు ".
" కాలం చేజార్చిన జీవితపు అద్దం
పగిలి ముక్కలైంది "
తాత్వికత నిండిన జీవితపు అనుభవసారమిది.
" పగలంతా
బాధ్యతల బరువు
రాత్రంతా
నన్ను నేను అన్వేషించుకుంటూ
నిన్ను చేరే ప్రయత్నంలో.."
గతానికి, వాస్తవానికి మధ్యన నలుగుతున్న మనసు తపన ఇది.
" గుప్పెడు అక్షరాలతో గంపెడు ప్రేమను
కలిపి రాసిన నా మనసు పుస్తకం
మన తరాలకు ప్రేమతత్వాన్ని
బోధిస్తుంది "
ఈ వాక్యాలు చాలు ఈ కవితా సంపుటి నిండా ఏముందో చెప్పడానికి. మన తరాలకేంటి తరువాత పది తరాలకు కూడ బంధం విలువ, ప్రేమ గొప్పదనం తెలుపుతుంది.
ఇవే కాకుండా అన్నీ నేర్పిన నాన్న తనను మర్చిపోయి ఉండటమెలాగో నేర్పలేదని వాపోతారు నాన్న యాదిలో కవితలో. జ్ఞాపకాలను పదిలం చేసుకున్న గుండె చప్పుడును, మహిళ గొప్పదనాన్ని,
చెదిరిన కలను, జీవిత పుస్తకాన్ని, మది అంతర్మధనాన్ని, చేజారిన కలలను, చెక్కిలిని తడిపిన కన్నీళ్ళను తన అక్షరాలతో మన మనసులను కూడా చెమ్మగిల్లేటట్లు చేసిన ప్రమెాద్ ఆవంచ గారి " గుండె చప్పుళ్లు " కవితా సంపుటికి హృదయపూర్వక శుభాభినందనలు. కనబడని మనసు స్పందనను పదిమంది మెచ్చే కవిత్వంగా మలచడమే కాకుండా, తన మనసుతో రాసి అందరి గుండెలను చప్పుడు చేయించిన ఈ " గుండె చప్పుళ్లు " కు అభిమానంతో నన్నూ నాలుగు మాటలు రాయమన్నందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
మంజు యనమదల
విజయవాడ
వర్గము
ముందు మాటలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి