చిన్నప్పుడు అవనిగడ్డ శిశువిద్యామందిరంలో శ్రీలత టీచర్ గారు నేర్పిన పాటలతో పాటుగా, రేడియోలో పాటలు వినడమంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం విజయనగరం వెళ్ళిన తర్వాత విశాఖపట్టణం రేడియోలో బుధవారం వచ్చే లలిత సంగీతం, ఆదివారం చిత్తరంజన్ గారు నేర్పే సామూహిక గేయాలు నేర్చుకోవడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు టివిలో, యుట్యూబులు వచ్చాక రేడియో దాదాపు కను(విన)మరుగైపోయింది.
అనుకోని అవకాశం కలిమిశ్రీ గారి ద్వారా విజయవాడ రేడియో స్టేషన్ లో కాలుమోపే అవకాశంతో పాటుగా ఓ పది నిమిషాలు కవితలు చదివే అవకాశం కూడా దొరికింది. కృష్ణకుమారి గారి ఓపికకు మనఃపూర్వక ధన్యవాదాలు. రాంగోపాల్ గారికి నా కవిత నచ్చకపోయినా చదివే అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు.
మెుత్తానికి నేనూ రేడియోలో చదివేశాను…ఎవరెలా అనుకున్నా నా సంతోషం నాదే…నా ఫోటోలు బాగా తీసిన కలిమిశ్రీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి