1. బాధ్యత
బరువు
బంధం
(అ)భద్రత
బతకడం
అనివార్యం..!!
2. దోమ
చిన్నది
రక్తదాహం
తీరనిది
సహజ
లక్షణం..!!
3. ఏదైనా
ఇంతేనేమో
తీసుకున్నది
తిరిగి ఇవ్వలేనంతగా
జాగ్రత్త
అవసరమే..!!
4. ఇవ్వక
తప్పదట
సాయం
పొందినందుకట
మిగిలిపోతున్న
బుుణమట..!!
5. మనిషి
మనసు
మాట
మౌనం
బంధానికి
ఆసరా..!!
6. అందరి
అవసరాలు
డబ్బు
చుట్టూనే
ఆర్థిక బంధం
బలమైనది..!!
7. గాయం
మనసుది
ప్రకటన
మనిషిది
ఏ యుద్ధమైనా
జీవన్మరణమే..!!
8. మళ్ళింపు
మనిషిది
గమనింపు
మనసుది
కాలం
మాయ ఇది..!!
9. జ్ఞాపకం
గతానిది
భవితకు
బాసట
గమనం
తప్పనిది..!!
10. మనిషి
ఆకారం
మనసు
నిరాకారం
ఆస్వాదన
అనంతం..!!
11. అమాస
పున్నములు
అనుబంధాల్లో
అరమరికలు
ఆత్మీయత
సినీవాలి..!!
12. మాటలు
రత్నాలు
మనసులు
ముత్యాలు
ఘ(ధ)న సంబంధాలే
అన్నీ..!!
13. చుట్టరికాల
చుట్టుకొలతలు
అనుబంధాల
వృత్తపరిధులు
అన్నీ
లెక్కల బంధుత్వాలే..!!
14. బయట
సేవలు
లోపల
స్కాములు
అందరూ
సుద్దపూసలే..!!
15. విరాళాల
వెల్లువ
నిధుల
మళ్ళింపు
చేతివాటం
మహా గొప్పది..!!
16. బంధం
ఏ జన్మదో
అనుబంధం
ఇప్పుడిలా
మమకారమే
మాయాపాశం..!!
17. అక్షరాల్లో
రాతలు
మనసు
అంతరంగం
జీవిత
పుస్తకం..!!