14, జూన్ 2014, శనివారం

ఏమి చేయలేక......!!

వెతల సొదలు రణగొణ ధ్వనులుగా
కలయో కలత నిదురో తెలియని
ఇన్నేళ్ళ సాంగత్య సహవాసంలో
దగ్గర కాలేని దూరం దగ్గరగానే ఉంటూ
తప్పెవరిదో తెలియని అయోమయంలో
రోజులు గడచి పోతూనే ఉన్నాయి..... 
మన మధ్యన సాన్నిహిత్యాన్ని పెంచలేక
బంధాన్ని తుంచలేక అలానే సాగిపోతూ
అతి సాధారణంగా అందరికి అగుపిస్తూ
అనుబంధపు తెరల అడ్డుగోడలు గట్టిపడుతు
ఎవరిని ఎవరం మోసం చేస్తున్నామో తెలిసినా
ఏమి చేయలేక కాలం సాగిపోతోంది నీకేం పట్టని
ఆత్మీయత దాని కోసం వెంపర్లాడే ఈ పిచ్చి
మదిని దాటని మధువు కోసం ఎదురుచూసే
నన్ను చూసి ఏమి చేయలేక నవ్వుకుంటూ
అందరి కధలను మోస్తున్నట్టే మన కతను
బరువుగా అనిపించినా తప్పని భారాన్ని
భరిస్తూ ఎప్పటిలానే సాగిపోతోంది మాములుగా....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శిశిర చెప్పారు...

హ్మ్

చెప్పాలంటే...... చెప్పారు...

:) Thank u

Chandra Vemula చెప్పారు...

దగ్గర కాలేని దూరం దగ్గరగానే ఉంటూ, తప్పెవరిదో తెలియని అయోమయంలో రోజులు గడచి పోతూ .... రెండు హృదయాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచలేక సాగిన బంధం .... కాలమహిమే అన్నట్లు
భావనలను జీవిత సత్యాలను ఆవిష్కరించిన విధానం చాలా బాగుంది
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ చక్కని చిక్కని వాక్కులకు నా ప్రణామాలు చంద్ర గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner