పుడమిని తాకే సంబరంలో
చినుకు చినుకులో సంతోషం
ధరిత్రిని దర్శించిన ఆ స్పర్శలో
పులకరించిన మదిని తడిమిందో
పలవరింత ఓమారు మరచి పోని
మరో అంతరంగం....!!
ఏడు రంగుల ఏకాంతం ఆ హరివిల్లు
చిన్ననాటి చినుకుల సహవాసం
చెలమ నీటి స్నానాలు మట్టితో
పుట్టించిన ఆకారాలు వేసుకున్న
మరకలు అమ్మ తిట్టిన తిట్లు
కాగితపు పడవల ఆనందాలు
అవే జీవితపు ఆనవాళ్ళని
తెలియని ఆ అమాయకత్వం
మళ్ళి తిరిగొచ్చేనా...!!
కాలం కరిగిపోయింది
మళ్ళి రాలేనంటు...
బాల్యం వెళ్ళిపోయింది
తల్చుకుంటూ ఉండమంటూ...
చదువుల పోరాటాల ఆరాటం
అనంత తీరాల ఆవలి పయనం
జీవితార్ధాలను వెదికే క్రమంలో
సరి కొత్త కోణాల రంగుల వలయం...!!
తలచుకుంటే తీపి జ్ఞాపకం
వదలి వేస్తె ఒంటరి ప్రయాణం
ఆస్వాదిస్తే అనుభూతుల మయం
అన్ని రుచుల సమ్మేళనం
అనుభవాల వడపోతల చివరి అంకం
అందుకే ప్రతి క్షణం మనదే...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఏడు రంగుల ఏకాంతం ఆ హరివిల్లు ఆ చిన్ననాటి చినుకుల సహవాసం ఆ చెలమ నీటి స్నానాలు .... బంకమట్టితో ఏర్పరచిన రూపాలు వేసుకున్న మరకలు అమ్మ తిట్టిన తిట్లు తేలుతూ కదిలిన కాగితపు పడవల ఆనందాలు .... అవే జీవితపు ఆనవాళ్ళని తెలియని ఆ అమాయకత్వం మళ్ళి తిరిగొచ్చేనా...!!
ఎంత సున్నితం గా పసి మనసు అమాయకత్వాన్ని అక్షర చిత్రణ చేసారు. బహు చక్కని భావనావిన్యాసం చదువుతున్నా చూస్తున్నట్లే ఊంది
శుభాభినందనలు మంజు యనమదల గారు
మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి