16, జూన్ 2014, సోమవారం
అనుబంధాలకు వారధులు కండి....!!
ఏవిటోనండి మనం ఎన్నో అనుకుంటూ ఉంటాము కాని కొన్నే జరుగుతాయి కొందరికి...అస్సలు ఏది జరగదు మరి కొందరికి..కొందరికేమో అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగి పోతాయి...!! పిల్లలని కనగలం కాని వారి రాతను రాసే అదృష్టం మనకు ఆ విధాత ఇవ్వలేదు...అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన పద్దతిలో మనం పెరిగిన వాతావరణానికి అనుగుణంగా పెంచాలి అనుకుంటాము... అలానే మన ఇంటికి వచ్చే కోడలయినా అల్లుడయినా మనలో ఒకరిగా కలసి పోవాలని కోరుకోవడం అత్యాశ కాదు కానీ చాలా తక్కువ మందికి ఆ కోరిక తీరుతుంది అదీ ఈ రోజుల్లో నేను అన్న బంధం ఒక్కటే ఎక్కువగా రాజ్యం ఏలుతోంది....పెద్దవాళ్ళు అది ఎవరైనా అమ్మా నాన్న అయినా అత్తా మామ అయినా వారు మనను ఎలా చూసినా మనం వారిని మనవాళ్ళుగా అనుకుంటే చాలా పెద్ద ప్రాణాలు తెరిపిన పడతాయి.... అది మనం అమెరికాలో ఉన్నా అండమాన్ ఉన్నా ఎప్పటి నుంచో పెనవేసుకున్న ఆ బంధాలను దూరం చేయాలనుకోవడం చాలా పొరపాటు...రేపు మన బిడ్డలు మనకు దూరంగా ఉంటే....ఒక్కసారి ఆ పరిస్థితి ఊహించుకుంటే...మరి అన్ని అనుబంధాలు అలానే కదండీ...దూరంగా ఉన్న బిడ్డలతో మాట్లాడాలని చూడాలని పెద్దలకు కోరిక ఉండటంలో తప్పు లేదు కదా.... చదువుకున్న ఆధునికతను సంతరించుకున్న ఈనాటి మహిళలూ.... మహరాణులు మీ స్వార్ధం కోసం భర్తలను బిడ్డలను అడ్డు పెట్టుకోకండి..అందరూ అని కాదు చాలా మంది ఒంటరి జీవితాలకు తమ వారికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నో అందమైన బంధాలను దూరంగా నెడుతూ ఎందరి గుండె చప్పుడులను గుట్టుచప్పుడులుగా మారుస్తూ చెప్పలేని కధల వ్యధలను మీ ఆస్తులుగా చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి....డబ్బు అవసరమే కాని అదే జీవితంగా మార్చుకుంటున్నారు... ఎన్నో ఆప్యాయతలను కోల్పోతున్నారు... మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి చాలు....అందమైన ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ అందరి అపురూప ఆనందాల అనుబంధాలకు వారధులు కండి....జగమంత కుటుంబం మనది అనుకోక పోయినా మిధునంలా మిగిలి పోనివ్వకండి.....!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి